Revanth Reddy Government Introduced CAG preliminary audit report on Kaleshwaram Project Expenditure In Telangana | వడ్డీనే 2.52 లక్షల కోట్లు..వెలుగులోకి షాకింగ్ విషయాలు
Telangana budget 2024-25: రేవంత్ రెడ్డి సర్కార్.. అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చింది. అయితే.. 2022 మార్చి వరకు రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాలపై కాగ్ నివేదిక ఇవ్వగా.. విద్య, వైద్యం, నీటిపారుదల రంగాల గురించి అందులో ప్రస్తావించింది. అయితే.. సాగనీటి రంగంలో ఒక్కో ఎకరానికి 6.42 లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని.. 2032-33 నాటికి రూ.2.52లక్షల కోట్లు వడ్డీనే చెల్లించాల్సి ఉంటుందని నివేదికలో కాగ్ పేర్కొంది.
ముఖ్యాంశాలు:
- కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరతపై కాగ్ తీవ్ర సందేహాలు.
- భారీ స్థాయిలో రుణాలు, కరెంట్ బిల్లులపై ఆందోళన.
- పనుల అసంపూర్తిపై ప్రశ్నలు.
- రూ. లక్షన్నర కోట్లకు అంచనా వ్యయం పెరుగుతుందని ఆక్షేపణ.
- సర్కారుకు ప్రాథమిక ఆడిట్ నివేదిక.
- కాగ్ కు వివరణలపై సర్కారు మల్లగుల్లాలు.
Revanth Reddy Government Introduced CAG preliminary audit report on Kaleshwaram Project
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తీవ్ర అభ్యంతరాలతో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరత, భవిష్యత్తు మనుగడపై కాగ్ తీవ్ర సందేహాలను వ్యక్తం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్లో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం ద్వారా అనవసర భారం పడినట్లు ఆక్షేపించినట్లు సమాచారం.
Telangana budget 2024-25: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు 2022 మార్చినాటికి ఎలా ఉన్నాయన్నదానిపై కాగ్ విడుదల చేసిన నివేదికను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టింది. అప్పటి ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు చాలా తక్కువగా ఉందని నివేదికలో కాగ్ పేర్కొంది. విద్య, వైద్యం, నీటిపారుదల తదితర రంగాలకు సంబంధించిన అంశాలను నివేదికలో ప్రస్తావించిన కాగ్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం మాత్రం ఏమీ లేదని పేర్కొంది. రీ డిజైనింగ్ వల్ల.. అప్పటికే పూర్తి చేసిన కొన్ని పనులు ఎందుకు పనికిరాకుండా పోయాయని.. ఫలితంగా రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో కాగ్ పేర్కొంది.
రెండేళ్లపాటు సుదీర్ఘ ఆడిట్..
ఈ ప్రాజెక్టుపై రెండేళ్లపాటు సుదీర్ఘ ఆడిట్ నిర్వహించిన తర్వాత కాగ్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను రూపొందించింది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలపి చెల్లింపులకు ఏటా రూ.13 వేల కోట్లు, ప్రాజెక్టు విద్యుత్ చార్జీలకు ఏటా మరో రూ. 12 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు రూ. 270 కోట్లు కలిపి ఏటా సుమారు రూ.25 వేల కోట్ల వ్యయం కానుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకరం ఆయకట్టు సాగుకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం రూ.6.4 లక్షలు కానుందని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది.
ప్రాజెక్టు 12 శాతమే పూర్తి…
కాళేశ్వరం ప్రాజెక్టులోని 56 పనుల్లో ఇప్పటివరకు 12 మాత్రమే పూర్తయ్యాయని, మరో 40 పనులు 3 శాతం నుంచి 99 శాతం వరకు, మిగిలిన 4 పనులు ఇంకా ప్రారంభం కాలేదని నివేదికలో కాగ్ వివరించినట్లు తెలిసింది. ప్రాజెక్టు భూసేకరణ కోసం 98,110 ఎకరాలకుగాను 63,972 ఎకరాలనే సేకరించారని తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన అప్పుల్లో రూ.1,700 కోట్లను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు ఆరోపించింది.
ఉన్నతాధికారుల భేటీ…
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మేరకు కాగ్ తీవ్ర సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర నీటిపార్డు దల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కాగ్ ని వేదికపై బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు చర్చించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణలను తీసుకున్నాక తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
రుణాలు, వడ్డీల భారం…
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిపి 15 భారీ రుణాల రూపంలో మొత్తం రూ.97,449 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వార్షిక వడ్డీ రేట్లు 8.25 శాతం నుంచి 10.9 శాతం వరకు ఉన్నాయి. 2023-24 నుంచి 2034-35 మధ్యకాలంలో ఏటా రూ.13 వేల కోట్లను వడ్డీలతో సహా రుణాల తిరిగి చెల్లింపుల కోసం కట్టాల్సి ఉండనుంది.
వేల కోట్లకుపైగా ఖర్చు..
ఇప్పటివరకు పొందిన రుణాల తిరిగి చెల్లింపులు 2039-40 వరకు కొనసాగనున్నాయి. దీని నిర్మాణానికి ఇప్పటివరకు రూ.85 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1.50 లక్షల కోట్లకు ఎగబాకనుందని కాగ్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కింద ఎకరా ఆయకట్టు సాగుకు రూ. లక్ష వరకు కరెంట్ బిల్లు కానుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అయితే.. రాష్ట్రంలో సాగునీటి కోసం ఒక్కో ఎకరానికి రూ.6.42లక్షలు అవుతుందని కాగ్ తెలిపింది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51శాతంగా అంచనా వేయగా.. అది కాస్త 0.75 శాతంగా తేలుతోందని.. మరింత తగ్గే అవకాశం కూడా ఉందని తెలిపింది. భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్‌ను నిర్మించినట్టు కాగ్ నివేదిక పేర్కొనటం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Revanth Reddy Government Introduced CAG preliminary audit report on Kaleshwaram Project
2 thoughts on “Revanth Reddy Government Introduced CAG preliminary audit report on Kaleshwaram Project-2024 | వడ్డీనే 2.52 లక్షల కోట్లు..వెలుగులోకి షాకింగ్ విషయాలు”