BRS MLC Kalvakuntla Kavitha to skip CBI Summons in Liquor Scam Case | సీబీఐకి కవిత లేఖ..విచారణకు రాలేను..
BRS MLC Kalvakuntla Kavitha to skip CBI Summons in Liquor Scam Case-2024: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. సీబీఐకి కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఆమె.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు వర్చువల్ గా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.
BRS MLC Kalvakuntla Kavitha to skip CBI Summons in Liquor Scam Case-2024
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనగా.. ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను విచారణకు హాజరుకాలేనంటూ.. సీబీఐకి కవిత లేఖ రాశారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని వివరించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కవిత కోరారు. వీటితే పాటు.. లేఖలో కవిత పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
సెక్షన్ 41ఏ నోటీసు..
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని గుర్తు చేసిన కవిత.. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు.
సీబీఐ చేస్తున్న..
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోందని కవిత లేఖలో పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని… పైగా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు.
Delhi Liquor Scam: ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని లేఖలో కవిత పేర్కొన్నారు. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని.. ఆ కేసులో తీర్పు వచ్చే వరకు తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చినట్టుగా గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందన్నారు.
15 నెలల విరామం తరువాత..
గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని కవిత చెప్పుకొచ్చారు. నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానన్నారు. కానీ.. 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తనకు పార్టీ అధిష్ఠానం కొన్ని బాధ్యతలు అప్పగించిందని కవిత తెలిపారు. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని వివరించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని.. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని లేఖలో స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించండి అని విజ్ఞప్తి చేశారు కల్వకుంట్ల కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలన మలుపు
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam) కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు అంటున్నాయి.
ఇదే కేసుల ఇప్పటికే కవితను మూడుసార్లు సీబీఐ ప్రశ్నించింది. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.
న్యాయమూర్తి ముందు కవిత పీఏ అశోక్ కౌశిక్ సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు కౌశిక్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. కవితతో పాటు కౌశిక్ని కూడా నిందితుడిగా సీబీఐ పరిగణిస్తోంది. సీబీఐ గతంలో ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చి స్టేట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా పలుమార్లు కవితను ప్రశ్నించింది.
Delhi Liquor Scam: చివరగా గత ఏడా ది జనవరి 16న విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. అయితే ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరుకాలేనంటూ ఆమె లేఖ రాశారు. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఏ విధమైన సమాధానం రాలేదు. సుప్రీంలో పిటిషన్పై ఈ నెల 28న విచారణ జరగనుంది.
సీబీఐ విచారణకు గైర్హాజరయ్యే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం. 26న విచారణకు వెళ్లొద్దని కవిత నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈడీ కేసులో 28న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో గైర్హాజరయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.