...

Bandi Sanjay Kumar Funny Comments On Tenth Hindi Paper-2024 | మ్యాథ్స్ పేపర్ లీక్ చేసినా నాకు పేరు వచ్చేది

Written by lsrupdates.com

Updated on:

Bandi Sanjay Kumar Funny Comments On Tenth Hindi Paper | మ్యాథ్స్ పేపర్ లీక్ చేసినా నాకు పేరు వచ్చేది.. హిందీ పేపర్ లీక్ చేస్తారా?: బండి సంజయ్

టెన్త్ పేపర్ లీక్ చేశానని తనపై దొంగ కేసులు పెట్టారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హిందీ పేపర్ లీక్ చేసినట్లు తనపై తప్పుడు కేసులు పెట్టారని.. ఎవరైనా హిందీ పేపర్ లీక్ చేస్తారా ? అని ప్రశ్నించారు. సైన్స్, మ్యాథ్స్ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపించినా.. కనీసం పేరు వచ్చి ఉండేదని సెటైర్లు వేసారు. అందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రధానాంశాలు:

  • టెన్త్ పేపర్ లీక్ అంటూ దొంగ కేసులు
  • హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా ?
  • బండి సంజయ్ వీడియో వైరల్

గతేడాది జరిగిన పదో తరగతి పరీక్షా పేపర్ లీకేజీ

Bandi Sanjay Kumar Funny Comments On Tenth Hindi Paper గతేడాది జరిగిన పదో తరగతి పరీక్షా పేపర్ లీకేజీ ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లో హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్షా పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ కేసులో అప్పటి బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి హైడ్రామా నడుమ ఆయన్ను ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత న్యామూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రశ్నించినందుకే బండి సంజయ్‌పై తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక ఈ కేసు గురించి బండి సంజయ్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టిందని అన్నారు. హిందీ పేపర్ లీక్ చేశానని కేసులు పెట్టారని.. ఎవరైనా హిదీ పేపర్ లీక్ చేస్తారా? అని ప్రశ్నించారు. మ్యాథ్స్ పేపరో.. సైన్స్ పేపరో లీక్ చేశారని చెబితే కనీసం పేరైనా వచ్చేదని సైటైర్లు వేశారు.

నాపై దొంగ కేసులు పెట్టారు

‘నాపై దొంగ కేసులు పెట్టారు. పేపర్ లీక్ చేసానని దొంగ కేసులు పెట్టారు. హిందీ పేపర్ లీక్ చేశానని కేసు పెట్టారు. ఎవరైనా హిందీ పేపర్ లీక్ చేస్తారా? మ్యా్థ్స్ పేపరో, సైన్స్ పేపరో లీక్ చేస్తే కనీసం నాకు పేరుస్తుండేనమో. హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా?’ అని సంజయ్ వ్యాఖ్యనించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఇదే కేసులో…

ఇక ఇదే కేసులో.. అప్పటి హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఈటెలకు కూడా పేపర్లు పంపించాడని భావించిన పోలీసులు ఈటెలకు నోటీసులిచ్చారు. ఈటలతో పాటు ఆయన పీఏలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Bandi Sanjay Kumar Funny Comments On Tenth Hindi Paper

Indiramma Indlu Scheme Applications Filtering through Artificial Intelligence in Telangana-2024 | పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ..! – Lsrallinonenews.com

Bandi Sanjay Kumar Funny Comments On Tenth Hindi Paper

AP People prepare to defeat YSRCP in 2024 | వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

A gift of a silver broom to clean the Garbh Griha for the Ayodhya Ram Mandir | అయోధ్య రాముడికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తుడు

ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్, అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ-2024

BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts | భారత్​ డైనమిక్స్​లో 361 ఇంజినీరింగ్​ పోస్టులు – పరీక్ష లేకుండానే జాబ్స్

Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.