...

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

Written by lsrupdates.com

Published on:

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

Awards and Sports Current Affairs of February 2024: ఉచిత కరెంట్ అఫైర్స్ క్విజ్‌లు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరియు అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గుర్తుంచుకోండి, పోటీ పరీక్షల ప్రపంచంలో, ప్రతి సమాచారం ముఖ్యమైనది. ఈ రోజువారీ, వార మరియు నెలవారీ ఉచిత కరెంట్ అఫైర్స్ క్విజ్‌లను సమాధానంతో ప్రయత్నించండి, మీ సంసిద్ధతను అంచనా వేయండి మరియు మీ వ్యూహాన్ని పరిపూర్ణం చేసుకోండి.

Awards and Sports Current Affairs of February 2024

ఈ పోస్టులో ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్, అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ సంబందించి-కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.

ఎల్ కె అద్వానికి భారతరత్న.. మోదీ కీలక వ్యాఖ్యలు

వెతికి అద్వానికి భారతరత్న మాజీ ఉప ప్రధాని, బీజీపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ(96)కి అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం అని ప్రశంసించారు.

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024
ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎల్ కె అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారనే వార్తను పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్ కె అద్వానీ రాజనీతిజ్ఞుడు. దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషి ఎనలేనిది. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంటులో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి” అంటూ మోదీ ట్వీట్ చేశారు.

కరాచీలో జననం, 14 ఏళ్ల వయసులోనే..

ఎల్ కె అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వా ఆయన 1927 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్(భారత్ విభజన కాకముందు) లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే పాక్ లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. 14 ఏళ్ల వసులోనే ఆర్ఎస్ఎస్ (1941లో) చేరారు.

తొలిసారి రాజ్యసభకు..

1966లో జరిగిన ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1970 వరకూ ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1970లో అద్వానీ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989 వరకూ నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. 1989లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2002 2004 దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయ్ హయాంలో దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా పనిచేశారు.

దేశ అత్యున్నత పురస్కారం

అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర కూడా చేశారు. ఇక 2015లో అద్వానీ భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను అందుకున్నారు. ఇప్పుడు భారతరత్న పురస్కారాన్ని అందుకోనున్నారు.

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు అందుకున్న భారతీయులు వీరే..

ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఫిబ్రవరి 4వ తేదీ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్ రామ్ను గ్రామీ అవార్డులు వరించాయి.

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024
ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్ లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్ రామ్, జాకీర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్ (పాస్ట్రో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ (యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాప్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్ లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు.

టేలర్ స్విఫ్ట్ కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు..

ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్ నైట్’ ఆల్బమ్ అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలిష్కు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు.

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024
ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

పీవీ నరసింహారావుకు భారతరత్న.. పీవీతో పాటు మరో ఇద్దరికి..

తెలుగు బిడ్డ, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్  స్వామినాధన్ కు కూడా భారతరత్న ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇప్పటికే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కె అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐదు మందికి భారతరత్న పురస్కారం ప్రకటించింది.

పీవీ ప్రస్థానం ఇదే..

పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్బై చెప్పారు.

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024
ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

1977లో హనుమకొండ లోకసభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

‘భారతరత్న’కు ఎంపికైన ఐదుగురూ ‘పంచరత్నాలు’.. వారికి ఉండే సౌకర్యాలు ఇవే..

దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఏకకాలంలో (కొద్ది తేడాలతో) ఐదుగురిని వరించింది. ఠాకూర్కు కొన్ని రోజులు ముందుగా, ఆ తర్వాత కొన్ని రోజులకు అద్వాణీకి, మిగిలిన ముగ్గురికీ తాజాగా ఒకేరోజు చేరింది. చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్, పీ.వీ. నరసింహారావు ముగ్గురూ ముగ్గురే! ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ ఐదుగురిలో ఎల్ కె అద్వాణీ ఒక్కరే జీవించివున్నారు. మిగిలినవారు గతించినా, చరిత్రగతిలో చిరయశస్సుతో చిరంజీవిగా జీవిస్తారు.

ఠాకూర్ కు ప్రకటించినప్పుడు దేశంలో పెద్ద స్పందన లేదు. పర్వాలేదులే అనుకున్నారు. అద్వాణీకి ప్రకటించిన అందరూ ఆశ్చర్యపోయారు. పీ.వీ. నరసింహారావుకు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ కు కూడా ఇవ్వాలనే అభ్యర్థనలు తెలుగువారి నుంచి వినిపించాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ముఖ్యంగా తెలుగువారిని అమితానంద పరిచేలా ‘పీవీ వార్త’ గొప్ప సందడి చేసింది. ఏదోరోజు ఎన్టీఆర్ కు కూడా దక్కుతుందనే ఆశ కూడా చిగురిస్తోంది. కొద్దికాలం వ్యవధిలోనే ఇందరు పెద్దలకు అతిపెద్ద ‘భారతరత్న’ ప్రదానం చెయ్యడం చాలా గొప్ప విషయం.

ఈ నిర్ణయం వెనకాల ఎందరి సలహాలు ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా అభినందనలు అందుకోవాల్సిన వ్యక్తి నూటికి నూరు శాతం మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇన్నేళ్ల స్వాతంత్ర్య భారతంలో ఈ తీరుగ నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రధాని మోదీ. కొందరికి ఆలస్యమైంది, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది వున్నారు అన్నమాటలు వాస్తవమే ఐనప్పటికీ, ఈ స్థాయిలో ‘భారతరత్న’ ప్రదానం చేయడం పరమానందకరం. మొన్ననే! ఇద్దరు తెలుగుతేజాలు ఎం. వెంకయ్యనాయుడు, చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ ప్రకటించడంతో తెలుగువారు ఎంతో అనందించారు.

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024
ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

ఆ ఆనందడోలికల్లో ఇంకా తేలుతూనే వున్నాం, తూలుతూనే వున్నాం. నేడు పీవీకి ‘భారతరత్న’ ప్రకటనతో ఆనందతాండవంలోకి ప్రవేశించాం. ఎన్నికల వేళ నరేంద్రమోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమే కాదు, అనూహ్య వ్యూహం. ఈ దెబ్బతో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులకు నోటమాట ఆగిపోయేట్టు చేశారు. అద్భుతమైన రాజనీతి. ఎన్నికల్లో తప్పక మేలుచేస్తుంది. పీవీని కాంగ్రెస్ దూరం చేసుకుంది. కాంగ్రెస్ ఎంత దూరం చేసుకుందో, మోదీ బీజేపీ ప్రభుత్వం అంతకు మించి దగ్గరకు తీసుకుంది.

ఈరోజు భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ ‘పంచరత్నాలు’. వీరి నేపథ్యాలు భిన్నం, ప్రాంతాలు విభిన్నం. కానీ, వీరి ఆత్మ ఒక్కటే! అదే ‘భారతీయం’. వీరు కేవలం భారతీయులు కారు, విశ్వమానవులు. ఈ ఐదుగురు పంచభూతాల్లాంటివారు. విశ్వదృష్టితో విశాలంగా అలోచించినవారు. ఇందులో స్వామినాథన్ తప్ప మిగిలినవారికి రాజకీయ నేపథ్యం ఉండవచ్చు గాక! దాని వెనక జాతి హితం వుంది. ఒక్కొక్కరూ ఒక్కొక్క రంగానికి, తత్త్వానికి, ప్రయోజనానికి ప్రతీకలు. అందరూ స్ఫూర్తిప్రదాతలే. వారు వేసిన మార్గంలో నడవడం ఎవరికైనా, ఎప్పటికైనా తప్పదని నిరూపించినవారే.

ఈ సందర్భంలో, ఈ సంరంభంలో మన ‘తెలుగువెలుగు’ పీవీని ప్రత్యేకంగా తలచుకుందాం. వంద సంవత్సరాల క్రితం (1921), ప్రఖ్యాత జంటకవులు కొప్పరపు సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెంలో రాజా బొమ్మదేవర నాగన్న నాయుడు రాజాస్థానంలో ‘సంపూర్ణ శతావధానం’ చేశారు. అందులో ఒక పద్యం చెప్పారు. పీవీ నరసింహారావు పుట్టిన సంవత్సరం కూడా 1921. ఆ మహాకవులు రచించిన ఆ పద్యాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

ఎట్టివారు మంత్రిపదవికి అర్హులు? ఇది ఒక పృచ్ఛకుడు సంధించిన ప్రశ్న. దీనికి కొప్పరపు కవుల పద్యరూపమైన సమాధానం.

“పతికిన్ భూప్రజకాప్తుడై, బహు విధోపాయంబులన్ శాత్రవ

ప్రతతిం గీడ్వడ జేసి, రాణ్మణికి హర్షశ్రీలు సేకూర్చి, ధీ

చతురుండై, పటుకార్య కౌశలుడునై సత్కీర్తులం బొల్తునే

మతిమంతుండతడే యమాత్యపద సంభావ్యుండగున్ భూవరా”

ఇదీ సంపూర్ణ పద్యం. ‘మంత్రిగా పీఠంపై కూర్చోవలసినవారికి ఎటువంటి అర్హతలు ఉండాలో కవులు స్పష్టంగా వివరించారు. రాజుకు, ప్రజలకు పరమ ఆప్తుడై, బహు ఉపాయాలతో శతృవులను తొకి పడేసేవాడై, రాజ్యానికి ఎల్లవేళలా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ, చతుర బుద్ధిబల సంపన్నుడై, ఎటువంటి కార్యాన్నైనా అలవోకగా నిర్వహించే చాతుర్యం కలిగి, రాజ్యానికి, రాజుకు, ప్రజలకు, మంత్రిమండలికి, సత్కీర్తులు కలుగజేసే మతిమంతుడు ఎవరై ఉంటారో? అటువంటివారే మంత్రిపదవికి సంపూర్ణంగా అర్హులౌవుతారు రాజా….!’ అని ఈ పద్యం చెప్పే తాత్పర్యం.

ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాజాస్థానాలలో అటువంటి ప్రధానమంత్రులు, మహామంత్రులు ఉండేవారు. అటువంటివారినే మంత్రులుగా నియమించుకొనే ప్రభువులు ఉండేవారు. స్వాతంత్య్రం రాక ముందు, దివానులు కూడా అటువంటివారే ఉండేవారు. పీవీ నరసింహారావు నూటికి నూరుశాతం అటువంటి విలక్షణ, లక్షణ సంపన్నుడైన మంత్రీశ్వరుడే. అటువంటి మహామంత్రులకు అసలు సిసలైన వారసుడే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మారుతున్న రాజకీయ ప్రభుత్వాల నేపథ్యంలో, పూర్వుల వలె సకల సద్గుణ, సర్వజ్ఞాన క్రియాశూరులైన మంత్రులు దొరకడం దుర్లభమేనని నడుస్తున్న చరిత్ర చెబుతోంది.

ఇటువంటి సంధికాలంలోనూ కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు దొరకడం దేశానికి వైభవ చిహ్నం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా దేశాన్ని పాలించిన సమయంలో, కేంద్రమంత్రిగా పీవీ విశేషమైన సేవలు దేశానికి అందించారు. వ్యక్తిగతంగానూ వారికి విశిష్టమైన సలహాలను అందజేశారు. తర్వాత కొంతకాలానికి ఆయనే రాజు అయ్యారు. ఆ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రభువుగా తనకు దక్కిన స్వాతంత్య్రానికి పొంగిపోయి, నియంతగా మారక, ప్రజాస్వామ్యయుతంగా పాలనను అందించారు. రాజు మంత్రి ఇద్దరి అంతరంగాలు బాగా ఎరిగిననవాడు కాబట్టి, మంచి మంత్రులను, మంచి సలహాదారులను నియమించుకున్నారు.

“రాగ ద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విధులను నిర్వహిస్తాం” అని ప్రమాణ స్వీకార మహోత్సవంనాడు అందరు మంత్రులు ప్రమాణం చేస్తారు. అదికూడా ఆత్మసాక్షిగా అంటూ ఒట్టు కూడా వేస్తారు. ఆ తర్వాత చరిత్రను గమనిస్తే, ఎందరు ఆ ప్రమాణాన్ని పాటించారన్నది లోక విదితమే. దానిని అక్షరాలా పాటించినవారు అతి తక్కువమంది. వారిలో ప్రథమ శ్రేణీయుడుగా గణనీయుడు పీవీ. ఆణిముత్యాల వంటి ఎందరినో తన సలహా మండలిలో, వివిధ హోదాల్లో నియమించుకున్న ప్రతిభా పక్షపాతి. ఆ జాబితా అతి పెద్దది. ఒక్క మన్మోహన్ సింగ్ చాలు, గొప్పగా ఉదాహరించడానికి.

నిన్ననే మన్మోహన్ సింగ్ పై సభా మధ్యమున మన ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. ఆ మరునాడే పీవీకి ‘భారతరత్న’ ప్రకటించారు. పాఠాలు చెప్పుకుంటున్న ఆచార్యుడిని తీసుకువచ్చి, కేంద్రమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ఘనత మన పీవీదే. తదనంతరం ఆయనే ప్రధానమంత్రిగా పదేళ్లు దేశాన్ని పాలించారు. అంతటి దార్శనిక ప్రతిభ పీవీది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించుకోవాలో తెలియడం కూడా మంచి మంత్రికి వుండే మంచి లక్షణం. పీవీని అపరచాణుక్యుడుగా అభివర్ణిస్తారు. పీవీలో చాణుక్యుడుతో పాటు తిమ్మరసు, తిక్కన, అల్లసాని పెద్దన కూడా ఉన్నారు.

చాణక్యుడు అనగానే అర్థశాస్త్రం గుర్తుకు వస్తుంది. పీవీ అనగానే ఆర్థిక సంస్కరణలు గుర్తుకు రాక తప్పవు. ‘అర్థశాస్త్రం’లో కేవలం ఆర్థిక అంశాలే కాదు అనేకం ఉన్నాయి. పాలన, రాజనీతి, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక పరిజ్ఞానం, విదేశాంగ విధానం మొదలైన విశేష అంశాల కలయిక కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’. పీవీ జ్ఞానం కూడా వీటన్నిటి సముదాయమే. చాణుక్యుడు / కౌటిల్యుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలను అమలుపరచాడు. పీవీ కూడా ఇంచుమించుగా అదే వరుసలో సంస్కరణలు చేపట్టారు. కాలమానాలను బట్టి వ్యూహాలు, ప్రాధాన్యతలు మారాయి అంతే. చాణుక్యుడు పేదలపట్ల ఎంతో దయకలిగి ఉండేవాడు.

చివరిదశలో తన సంపదనంతా పేదలకే దానం చేశాడు. పీవీ తన వందలాది ఎకరాల భూమిని తొలిదశలోనే పేదలకు దానం చేశారు. చాణుక్యుడికి భయం అంటే ఏమిటో తెలియదు. పీవీ కూడా తాను చేపట్టాలనుకున్న కార్యక్రమాలన్నీ నిర్భీతిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు చేపట్టినప్పుడు భూస్వాములంతా బెదిరించే ప్రయత్నం చేసినా ఎవరికీ లొంగలేదు, ఎక్కడా తగ్గలేదు. చివరికి పదవిని కోల్పోయినా లెక్కచేయలేదు. ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పుడు కూడా ఎవరి బెదిరింపులకు చలించలేదు. ఆయన అంతరాత్మకు తప్ప దేనికీ వెరవలేదు. అందుకే, ఏ పని చేసినా త్రికరణశుద్ధితోనే ఆచరించారు. రాజు తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి, శతృవుల నుంచి తనను, తన రాజ్యాన్ని రక్షించుకోడానికి అవలంబించాల్సిన మార్గాలను కౌటిల్యుడు వివరించాడు.

విదేశీ వాణిజ్యం ఎలా చెయ్యాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో ఎలా వ్యవహరించాలి తెలిపాడు. పీవీ వాటన్నింటినీ అందిపుచ్చుకుంటూనే తనదైన మార్గంలో నడిచారు. జ్ఞానయోగిగా తాను పొందిన జ్ఞానాన్ని, ఆ మహాగ్రంథాల సారాన్ని ఆధునిక మార్గంలో ఆచరణలో చూపించారు. జవహర్ నెహ్రూ, ఇందిరాగాంధీ నిర్దేశించిన ఆర్ధిక విధానాలకు గౌరవం, ప్రచారం కలిపిస్తూనే, దేశ పరిస్థితులకు అనుగుణంగా, తన సరళిని జతపరచి జేజేలు కొట్టించుకున్నారు. అదే పీవీ చూపించిన లౌక్య ప్రతిభ.

చీఫ్ ఎలక్షన్ కమీషనర్గా టీఎన్ శేషన్ ధిక్కార స్వరంతో సర్వ స్వతంత్రుడుగా వ్యవహరిస్తున్న సమయంలో, అదనంగా మరో ఇద్దరు కమీషనర్లను నియమించి, సరిచేసి సమతుల్యతను ఏర్పరచారు. ఇదీ మంత్రాంగంలో భాగమే. కౌటిల్యుడు ‘అర్ధశాస్త్ర’ రచనకు శ్రీకారం చుట్టినపుడు అర్ధశాస్త్ర ప్రవర్తకులుగా భావించే బృహస్పతికి, శుక్రాచార్యుడికి తొలి నమస్కారం సమర్పించాడు. అట్లే, పీవీ కూడా చాణుక్యుడు, తిమ్మరసు మొదలు మహామంత్రులందరికీ మనసులో నమస్కారం చేసుకొని, ముందుకు సాగి వుంటారు. ఇదంతా భారతీయమైన ఆలోచనా విధానమే.

పీవీ ఆసాంతం భారతీయతను అంటిపెట్టుకొని జీవించారు. కౌటిల్యుడు చాలా సూత్రాలను నిర్దేశించాడు. పెద్దల సహవాసం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇంచుమించు వాటన్నింటినీ పీవీ పాటించారు. చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని గ్రహించి, అమెరికాతో బంధాలను పెంచారు. అదే ఈరోజు అక్కరకు వస్తోంది. భవిష్యత్తు మొత్తం శాస్త్ర, సాంకేతిక రంగాలదేనని గ్రహించి, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతానికి బలమైన పునాదులు వేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో కుగ్రామం నుంచి అమెరికా రాజధాని వాషింగ్ టన్ డిసీలో ఉండేవారిని, చూస్తూ వీడియో కాల్లో మాట్లాడుకునే సౌకర్యం ఈనాడు మనం అనుభవిస్తున్నాం.

ఇండియాలో కూర్చొని ఆస్ట్రేలియా యూనివర్సిటీలో ఆన్ లైన్ కోర్సును చేయగలుగుతున్నాం. అంబాసిడర్, ఫియట్, మారుతివంటి నాలుగైదు మోడల్స్ తప్ప మిగిలిన కార్లు మనకు తెలియదు. ఇప్పుడు రోల్స్ రాయిస్ మొదలు అనేక విదేశీ కార్లు మన రోడ్లపై తిరుగుతున్నాయి. విమానాలలో ప్రపంచ దేశాలన్నింటినీ ఈనాడు చుట్టేస్తున్నాం. ఈ సకల భోగాలన్నీ పీవీ నరసింహారావు కల్పించిన ఆర్ధిక సంస్కరణల మహాఫలమే. ఇదే ంచిన ఆర్ధిక దార్శనికత, దేశభక్తికి ప్రతీక.

మౌనం విలువ, మాట విలువ తెలిసిన వాడు కాబట్టే, కాబట్టే, అన్ని భాషలను నేర్చుకున్నా కొన్ని వేళల్లో మౌనాన్నే ఆశ్రయించారు. ఒక సందర్భంలో, స్పానిష్లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదీ మంత్రిత్వ ప్రతిభలో భాగమే. దార్శనికత, దేశభక్తి, సకలశాస్త్ర జ్ఞానసంపద, సంయమనం, ఆచరణాశీలం కలిగిన జ్ఞానయోగి, కర్మయోగి పీవీ. మహారాజులు, చక్రవర్తుల కాలం తర్వాత ఆధునిక యుగంలో, నేటి భారతంలో పీవీ నరసింహారావు నిస్సందేహంగా మహామంత్రి శబ్దవాచ్యుడు. అచ్చమైన ఆంధ్రుడు, స్వచ్ఛమైన భారతీయుడు. ఈ మహామనీషికి భారతప్రభుత్వం ‘భారతరత్న’ అందించి తన ఔన్నత్యాన్ని చాటుకుంది.

ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 9న మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించింది.

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024
ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. ఇప్పటివరకు 53 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. సాధారణంగా ఒక సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తుంటారు. కానీ, దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని నలుగురికి ప్రదానం చేశారు. అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. కాగా, ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైనవారిలో ఎల్ కె అద్వానీ  మాత్రమే జీవించి ఉన్నారు.

సీహెచ్ ఓ యామినీకి జాతీయ అవార్డు

గ్రామీణ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు గాను కృష్ణా జిల్లా వణుకూరు–2 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్(వెల్నెస్ సెంటర్)లో కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్ వో)గా పనిచేస్తున్న మంత్రి ప్రగడ యామినీకి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి జాతీయ అవార్డు లభించింది. ఫిబరవరి 8వ తేదీ న్యూఢిల్లీలో నిర్వహించిన సుశృత అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

దేశ వ్యాప్తంగా హెల్త్కేర్ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 53 మందికి కేంద్ర ప్రభుత్వం సుశృత అవార్డులు అందజేయగా, మన రాష్ట్రం నుంచి యామిని ఒక్కరే ఈ అవార్డును అందుకున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ మిన్లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్ హెచ్పీ) / కమ్యూనిటీహెల్త్ ఆఫీసర్ (సీహెచ్ ఓ) కేటగిరిలో ఈ అవార్డు వరించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విలేజ్ హెల్త్ క్లినికసక్కు అధునాతన భవన నిర్మాణాలు చేపట్టింది. దీంతో ఇప్పటికే ఆమె పనిచేస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్కు నేషనల్ క్వాలిటీ ఎస్యురెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ (ఎన్ క్యూఏఎస్ఎస్) లభించింది. ఇప్పుడు అదే సెంటర్ లో పనిచేస్తున్న సీహెచ్ ఓ కు జాతీయ గుర్తింపు లభించింది.

Awards and Sports Current Affairs of February 2024 #Awards and Sports Current Affairs of February 2024 #Awards and Sports Current Affairs of February 2024 #Awards and Sports Current Affairs of February 2024 #Awards and Sports Current Affairs of February 2024 #Awards and Sports Current Affairs of February 2024

Awards Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1

మార్చి 7th – 12th 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of March 7th – 12th 2024

జనవరి 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of January Month 2024 

TSPSC Group-1 Preliminary Exam-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1

Latest Current Affairs January 2024 Part-1 in English

Business – Economy and Defense Latest Current Affairs January 2024 Part-2 in English

2 thoughts on “ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.