...

ఏప్రిల్ నెల కరెంట్ అఫైర్స్ | April Month Current Affairs with Answers Part-1

Written by lsrupdates.com

Published on:

ఏప్రిల్ నెల కరెంట్ అఫైర్స్ | April Month Current Affairs with Answers Part-1

April Month Current Affairs with Answers Part-1: ఉచిత కరెంట్ అఫైర్స్ క్విజ్‌లు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరియు అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గుర్తుంచుకోండి, పోటీ పరీక్షల ప్రపంచంలో, ప్రతి సమాచారం ముఖ్యమైనది. ఈ రోజువారీ, వార మరియు నెలవారీ ఉచిత కరెంట్ అఫైర్స్ క్విజ్‌లను సమాధానంతో ప్రయత్నించండి, మీ సంసిద్ధతను అంచనా వేయండి మరియు మీ వ్యూహాన్ని పరిపూర్ణం చేసుకోండి.

1) పీడే చెస్ తాజా ర్యాంకింగ్ లలో భారత్ తరపున మొదటి స్థానంలో (ప్రపంచంలో 9వ ర్యాంక్) నిలిచిన ఆటగాడు ఎవరు.?
Answer: అర్జున్ ఇరిగేసి

2) గంజాయి వాడకాన్ని చట్టబద్దత చేసిన దేశం ఏది.?
Answer: జర్మనీ

3) అమెరికాలోని ఏ రాష్ట్రం ప్లూటోను తమ అధికారిక గ్రహంగా ప్రకటించింది.?
Answer: ఆరిజోనా

4) ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ యూనియన్ ప్లూటోను గ్రహం హెూదా నుండి ఎప్పుడు తొలగించింది.?
Answer: 2006

5) 2024 మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంత.?
Answer: 1.78 లక్షల కోట్లు

6) మయామి మాస్టర్స్ టైటిల్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
Answer: యానిక్ సిన్నర్ (ఇటలీ)

7) ఇటీవల ఆకాశంలో కనిపించిన భారీ తోకచుక్క పేరు ఏమిటి.?
Answer: 12P/పోన్స్ – బ్రూక్స్

8) కేంద్ర గణాంకాల ప్రకారం 2018 – 2024 మధ్య విదేశాల్లో చనిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంత?
Answer: 403

9) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లైన మొత్తం జిఎస్టీ విలువ ఎంత.?
Answer: 20.18 లక్షల కోట్లు

10) అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు.?
Answer: రవి కోత

11) ట్రాఫిక్ నియంత్రణ కోసం అమెరికాలోని ఏ నగరంలో రద్దీ రుసుము (Traffic Tole) వసూలు చేయనున్నారు.?
Answer: న్యూయార్క్

12) కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఏ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.?
Answer: ఐఐసీటీ హైదరాబాద్

14) 2023 డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది.?
Answer: 160.69 లక్షల కోట్లు

15) విజ్ఞాన శాస్త్రంలో మహిళలు బాలికల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
Answer: ఫిబ్రవరి 11

16) ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ద్వీపం ఏ దేశాల మధ్య ఉంది.?
Answer: భారత్ -శ్రీలంక

17) పదివేల మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న తొలి దేశీయ కంపెనీగా ఏ కంపెనీ చరిత్ర సృష్టించింది
Answer: ఆదాని రెన్యూవబుల్ ఎనర్జీ

18) పోర్ట్స్ 2024 బిలీనియర్ల జాబితాలో ప్రపంచంలో, ఆసియా & దేశంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరు.?
Answer: బెర్నాల్డ్ ఆర్నాల్డ్, ముఖేష్ అంబానీ

19) భూమికి ఎన్ని కిలోమీటర్ల లోపల మహాసముద్రం అందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.?
Answer: 700 కిలోమీటర్ల లోతులో

20) దేశంలోనే తొలి ముడిచమురు స్టోరేజ్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
Answer: పాడూరు – కర్ణాటక

21) ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కిన 114 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఇటీవల మరణించారు. అతని పేరు ఏమిటి.?
Answer: జువాన్ వి సెంటీ పెరీజ్ మోరా (వెనిజులా)

22) ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
Answer: ఏప్రిల్ 2

23) ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
Answer: Empowering Autistic Voices

24) మొదటిసారిగా లిథియం అయాన్ బ్యాటరీ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.?
Answer: వడోదర – గుజరాత్

25) ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు?
Answer: 7.5%

26) ఫోన్ పే యూపీఐ సేవలను తాజాగా ఏ దేశంలో ప్రారంభించింది.?
Answer: సింగపూర్

27) అక్షయపాత్ర ఫౌండేషన్ తాజాగా ఎన్నో భోజనాన్ని వడ్డించింది.?
Answer: 400

28) వెయ్యి కిలోమీటర్ల దూరపు లక్ష్యాన్ని చేదించగల హైపర్ సోనిక్ క్షిపణి ని ప్రయోగించినట్లు ఏ దేశం ప్రకటించింది.?
Answer: ఉత్తరకొరియా

29) ఉక్రెయిన్ దేశం నిర్బంధ సైనిక శిక్షణ కొరకు వయోపరిమితిని 27 సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది.?
Answer: 25

30) తైవాన్ దేశంలో నమోదైన భూకంప తీవ్రత ఎంత.?
Answer: 7.4

31) గ్రామపంచాయతీలలో 100% సామాజిక తనిఖీలు పూర్తి చేసుకున్న రెండు రాష్ట్రాలు ఏవి?
Answer: తెలంగాణ, కేరళ

32) ఏ దేశ శాస్త్రవేత్తలు 100 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కృత్రిమ సూర్యుడుతో సృష్టించారు.?
Answer: దక్షిణ కొరియా

33) 2000 ఏళ్ల నాటి సీసపు నాణేలను తెలంగాణలో ఏ ప్రాంతంలో ఇటీవల కనుగొన్నారు.?.
Answer: పణిగిరి – సూర్యాపేట – తెలంగాణ

34) కృత్రిమ మేధస్సు తో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను భారతీయ డెవలపర్ వి హెచ్ మూఫీద్ ఆవిష్కరించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
Answer: దేవిక

35) అసోచామ్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
Answer: సంజయ్ నాయర్

36) కాంగో దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
Answer: జుడిత్ సుమిన్వ

37) అమెరికాలోని ఏ రాష్ట్రంలో 14 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకం నిషేధించారు.?
Answer: ప్లోరిడా

38) WHO నివేదిక ప్రకారం ప్రతి ఆరుగురు చిన్నారులలో ఎంతమందిపై సైబర్ వేధింపులు జరుగుతున్నాయి.?
Answer: ఒక్కరిపై

39) 1200 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రపంచంలోనే అతి తేలికైన బ్యాగును కోపర్ని అనే సంస్థ ఏ పదార్థంతో తయారు చేసింది.?
Answer: ఏరో జెల్(99% గాలి & 1% గాజు )

40) పెండింగ్ బిల్లుల ఆమోదం విషయంలో ఇటీవల రాష్ట్రపతి పై కోర్టుకెక్కిన రాష్ట్రం ఏది.?
Answer: కేరళ

41) భారత్ లో టీబీ (క్షయ) కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న మొదటి రెండు రాష్ట్రాలు ఏవి.?
Answer: ఉత్తర ప్రదేశ్ & బీహార్

42) నెల్లూరు జాతికి చెందిన ఏ రకం ఆపు బ్రెజిల్ లో 40 కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచ రికార్డు సృష్టించింది.?
Answer: వయాటినా 19 ఎఫ్ఎ ఐవీ మారా ఇమెవీస్

43) మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రోజు వారీ కూలీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంతకు పెంచారు.?
Answer: 300/-

44) Flood Hub Tool ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
Answer: గూగుల్

45) యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారత్ లో ఎప్పటి వరకు నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొంది.?
Answer: 2050

46) నోటి క్యాన్సర్ ను గుర్తించే లాలిపాప్స్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
Answer: బ్రిటన్

47) ఐఐటి పంజాబ్ పరిశోధకులు టాంటాలమ్ లోహాన్ని ఏ నదిలో కనిపెట్టారు.?
Answer: సట్లెజ్

48) మయన్మార్ దేశంలో భారత నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
Answer: అభయ్ ఠాకూర్

49) గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ప్రైజ్ 2024 ఎవరికి దక్కింది.?
Answer: మిచెల్ తలగ్రాండ్

50) ప్రిట్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
Answer: రికెన్ యమయొటా

51) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని వస్తువులకు జీఐ ట్యాగ్ లభించింది.?
Answer: 17

52) బాంబే ఐఐటీ, టాటా ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చేసిన పద్ధతి ఏమిటి.?
Answer: CART CELL THEROPHY

53) CART CELL THEROPHY ລ້ ລ້ 2.?
Answer: చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపి

54) వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సూర్య కాంతి ని మేఘాలు నుంచి పరావర్తనం చెందించడానికి అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టెక్నాలజీ పేరు ఏమిటి.?
Answer: మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్

55) భారతదేశంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
Answer: మధ్యప్రదేశ్

56) 2024 మార్చి మాసానికి గాను సేవల రంగం వృద్ధి ఎంతగా నమోదయింది.? ఇది 14 ఏళ్ల గరిష్టము.
Answer: 61.2%

57) భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసం ఏ టెక్నాలజీని ఇటీవల సైన్యంలో ప్రవేశపెట్టారు.?
Answer: ఆకాశ్ తీర్

58) నాటో 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బ్రెసెల్ లో ఘనంగా జరుపుకున్నారు ఏ రోజు నాటో ఆవిర్భావించింది.?
Answer:ఏప్రిల్ – 04 – 1949

59) తాజా పిఫా ర్యాంకింగులలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
Answer:121

60) తాజా పీఫా ర్యాంకింగులలో మొదటి మూడు దేశాలు ఏవి.?
Answer: అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్.

61) ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విభాగంలో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న భారత బ్యాట్స్మెన్ ఎవరు.?
Answer: యశస్వీ జైస్వాల్

62) అంతర్జాతీయ మైన్ అవగాహన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
Answer: ఏప్రిల్ 4

63) ఏ దేశం భారత దేశస్థులకు టూరిజం ఈ వీసా పద్ధతిని అమల్లోకి తెచ్చింది తెచ్చింది.?
Answer: జపాన్

64) దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన కృత్రిమ సూర్యుడి పేరు ఏమిటి.?
Answer: KSTAR

65) తాజాగా దేశవ్యాప్తంగా ఎన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించింది.?
Answer: 60

66) ఆర్బిఐ తాజా సమావేశంలో రేపో రేటును ఎంతగా ప్రకటించింది.?
Answer: 6.5%

67) ఆర్బిఐ తన సమీక్ష సమావేశంలో సీడీఎమ్ లలో ఏ పద్ధతి ద్వారా అనుమతించింది.?
Answer: యూపీఐ

68) ఆర్బిఐ 2024 – 25 లో భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా.?
Answer: 7%

69) ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్ ఏది.?
Answer: H5N1

70) లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్ లో ప్రస్తుతం ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఎన్ని ఉన్నాయి.?
Answer: 33 – 42

71) జీడీ బిర్లా అవార్డు ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ ను గెలుచుకున్న మహిళ శాస్త్రవేత్త ఎవరు.?
Answer: ఆదితి సేన్ డే

72) సనోఫి నుండి ఉత్పత్తి కానున్న నూతన పోలియో టీకా పేరు ఏమిటి.?
Answer: బయోవాక్స్

73) ప్రపంచంలో అత్యంత వయస్సు కలిగిన వ్యక్తిగా ఎవరికీ గిన్నిస్ బుక్స్ రికార్డు లో చోటు కల్పించారు.?
Answer: జాన్ టినిస్ ఉడ్ (బ్రిటన్)

74) CSIRO నివేదిక ప్రకారం సముద్ర గర్భంలో ఎన్ని టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయింది.?
Answer: 11 కోట్ల టన్నులు

75) దూరదర్శన్ లో తొలి తరం న్యూస్ రీడర్ ఇటీవల మరణించారు. అతని పేరు ఏమిటి?
Answer: శాంతి స్వరూప్

76) ప్రపంచంలోనే అతిపిన్న బిలీనియర్ గా పోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న 19 ఏళ్ల టీనేజర్ ఎవరు.?
Answer: లివియా వోయిట్ (బ్రెజిల్)

April Month Current Affairs with Answers Part-1 #April Month Current Affairs with Answers Part-1 #April Month Current Affairs with Answers Part-1

April Month Current Affairs with Answers Part-1 April Month Current Affairs with Answers Part-1 April Month Current Affairs with Answers Part-1 April Month Current Affairs with Answers Part-1 April Month Current Affairs with Answers Part-1

April Month Current Affairs with Answers Part-1April Month Current Affairs with Answers Part-1April Month Current Affairs with Answers Part-1April Month Current Affairs with Answers Part-1April Month Current Affairs with Answers Part-1

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.