...

AP People prepare to defeat YSRCP in 2024 | వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

Written by lsrupdates.com

Published on:

AP People prepare to defeat YSRCP in 2024 | వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

సీఎం జగన్ విశాఖలో సిద్ధం’ పేరుతో బహిరంగసభ నిర్వహించారని, కానీ వైకాపాను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రధానాంశాలు:

  • ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి జగన్ పారిపోయారు
  • పులివెందులలో గెలిచి చూపాలి
  • జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. భస్మాసురుడు
  • నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులు పెట్టారు
  • నెల్లూరు, పత్తికొండ ‘రా.. కదలిరా’ సభల్లో చంద్రబాబు

పత్తికొండ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

ఈనాడు – నెల్లూరు, కర్నూలు: సీఎం జగన్ విశాఖలో ‘సిద్ధం’ పేరుతో బహిరంగసభ నిర్వహించారని, కానీ వైకాపాను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు గ్రామీణ పరిధిలోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో, అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన ‘రా.. కదలిరా.. బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. “జగన్ వల్ల సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులుగా మారారు. పలువురిపై తప్పుడు కేసులు పెట్టారు. అందుకే జగన్ ను ఓడించడానికి అన్ని ఊళ్ల ప్రజలూ సిద్ధంగా ఉన్నారు. సీఎంను ఇంటికి పంపడానికి అన్నదాతలు.. తరిమికొట్టడానికి తెలుగు తమ్ముళ్లు.. వైకాపా జెండా పాతిపెట్టడానికి బడుగు బలహీనవర్గాలు సిద్ధంగా ఉన్నారు. సీఎం అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు, వైకాపా వాళ్లే వారి జెండా పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు. AP People prepare to defeat YSRCP in 2024

AP People prepare to defeat YSRCP in 2024 | వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
AP People prepare to defeat YSRCP in 2024 | వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

ఒక్క ఛాన్స్ అంటూ నాశనం

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ అందరినీ హింసిస్తున్నారు. ఆయనకు పత్తికొండ సభ చూస్తే రాత్రి నిద్ర రాదు. ఈ దెబ్బతో వైకాపా పని ఫినిష్. రా… కదలిరా సభలకు జనం విపరీతంగా తరలివస్తున్నారు. సీఎం బాదుడుకు బలైన ప్రజల గోడు వినిపిస్తోంది. ఉద్యోగం లేని నిరుద్యోగుల బాధ కనిపిస్తోంది. సాగునీరు లేని వ్యథ వినిపిస్తోంది. వేరే ప్రాంతాలకు వలసపోవాల్సి వస్తోందన్న ఆవేశం కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ… రెండు పార్లమెంటు సీట్లను గెలిపిస్తే… ముఖ్యమంత్రి మీకు ఏమైనా ఒరగబెట్టారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేశారా? ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఆయనకు అభివృద్ధి చేయడం, మీ జీవితాల్లో వెలుగు తేవడం, సంపద సృష్టించడం చేతకాదు.

ముఖ్యమంత్రి బీసీల ద్రోహి

ముఖ్యమంత్రి బీసీల ద్రోహి. ఆయన ఏ బీసీకైనా న్యాయం చేశారా? ఆదరణ, మరో 30 పథకాలను రద్దుచేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, కర్ణాటకలకు వలసపోయినవారిలో కర్నూలు నుంచి వెళ్లినవారే ఎక్కువ. ఏమిటీ ఖర్మ? తెదేపా అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ఉపాధి కల్పిస్తాం. వలసలు ఆపే బాధ్యతను తీసుకుంటాం. వెనకబడిన వర్గాలకు చెందిన కేఈ కృష్ణమూర్తిని డిప్యుటీ సీఎం చేసిన పార్టీ తెదేపా. ఆయన, యనమల రామకృష్ణుడు తదితర అనేకమంది బీసీ నాయకులను, ఎమ్మెల్యేలను రాష్ట్రానికి అందించిన పార్టీ తెదేపా. ప్రస్తుత పాలనలో బీసీలపై దాడులు పెరిగిపోయాయి. తన చెల్లెల్ని వేధించాడని ప్రశ్నించినందుకు అమరనాథ్ గౌడ్ను తగలబెట్టి చంపేశారు. ముఖ్యమంత్రి ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. బీసీని చంపిన నేరస్థులు రోడ్డుమీద తిరుగుతున్నారు. కోడికత్తి కేసులో శ్రీను ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతుంటే.. వివేకా హత్యకేసులో నిందితులు మాత్రం బయట తిరుగుతున్నారు. దీన్నిబట్టి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు.

Also Read:  

Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!

జగన్కు సబ్జెక్ట్ వీక్… బిల్డప్ పీక్

ఇండియాటుడే ఇంటర్వ్యూలో జగన్ న్ను ప్రశ్నపత్రంలో లేని ప్రశ్న అడిగేసరికి సమాధానం చెప్పలేకపోయిన మొద్దబ్బాయి. బీకాం అంటే ఏమిటో కూడా సరిగా చెప్పలేకపోయారు. ఆయన ఎక్కడ చదివారో నాకు తెలియదు. ఆయనకు సబ్జెక్టు వీక్, బిల్డప్ పీక్. మైనారిటీలను ఆయన నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.

పులివెందులలో గెలిచే పరిస్థితి లేదు

వైనాట్ 175 అన్న ముఖ్యమంత్రి దమ్ముంటే పులివెందులలో గెలిచి చూపించాలి. ఆయన ఎన్నికల ముందే యుద్ధరంగాన్ని వదిలి పారిపోయారు. బీసీలకో న్యాయం.. మీవాళ్లకో న్యాయమా? బీసీ మంత్రి జయరాంను ప్యాక్ చేసి కర్నూలు పంపిస్తే, ఆయన తాను చచ్చినా వైకాపాలో ఉండనని పారిపోయారు. మరో ఎంపీ సంజీవ్ కుమార్ పోటీచేయనని అస్త్రసన్యాసం చేశారు” అని పత్తికొండ సభలో చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ప్రజల నెత్తిపైనే భస్మాసుర హస్తం

జగన్ రెడ్డి అభిమన్యుడు కాదు.. అర్జునుడు కాదు.. భస్మాసురుడు. ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులు పెట్టారు. అన్నక్యాంటీన్లు, చంద్రన్న కానుకలు. విదేశీవిద్య, రైతుల రాయితీలు తీసేసిన వ్యక్తి పేదవాళ్ల ప్రతినిధా? జగన్ రెడ్డి చాలా పేదవాడంట! తనకు ఇల్లే లేదంటున్నారు. తాడేపల్లి, బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్ ప్యాలెస్లు లేవా? అబద్ధాలతో పుట్టిన వైకాపా.. సీఎం జగన్ మరోసారి అవే అబద్ధాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారు” అని నెల్లూరు సభలో చంద్రబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ, “99% హామీల అమలు అంటూ జగన్ అబద్ధాలు చెబుతున్నారు. తొమ్మిదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మద్యాన్ని నిషేధిస్తేనే ఓటు అడుగుతానని చెప్పి.. సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యం తయారుచేసి ప్రజల రక్తం తాగుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చానని గొప్పలు చెబుతున్నారు. దేశంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. తెదేపా-జనసేన పాలనలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తాం. అయిదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. డీఎస్సీ ప్రకటిస్తాం. అప్పటివరకు ప్రతినెలా రూ.3వేల నిరుద్యోగభృతి ఇస్తాం. తెదేపా అధికారంలోకి రాగానే సర్పంచులకు గౌరవం ఇస్తాం.

వైకాపా పతనం ప్రారంభమైంది

వైకాపా పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారు. దాంతో ఆయన రాజకీయాలే వద్దనే పరిస్థితి వచ్చింది. మాచర్ల నియోజకవర్గంలో పోలీసు వేధింపులు భరించలేక దుర్గారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయిదేళ్ల పాలనలో అందరూ బాధితులే. జగన్రెడ్డి పాలనలో నేనూ బాధితుడినే. అక్రమాలను ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై వేధింపులకు పాల్పడ్డారు. టీడ్కో ఇళ్లను పూర్తిచేయకుండా వంచించారు. అన్నింటిపైనా జగన్ రెడ్డి బొమ్మలే. ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేడు.

రాష్ట్రాన్ని నం.1గా నిలబెట్టే బాధ్యత తెదేపాది

రాష్ట్రానికి ఏం చేశానని నన్ను ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి పుట్టకముందే నేను రాజకీయాలు చేస్తున్నాను. నాకు ఇబ్బంది వస్తే.. రాష్ట్రంతో పాటు 80 దేశాల్లో ప్రజలు మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి, పోలవరం పూర్తికి కృషిచేశాం. అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. తిరిగి రాష్ట్రాన్ని, తెలుగువారిని ప్రపంచంలో నం.1 స్థానంలో నిలబెట్టే బాధ్యత తెదేపా తీసుకుంటుంది అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పి.నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్, బొల్లినేని రామారావు, తెదేపా పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి...

BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts | భారత్​ డైనమిక్స్​లో 361 ఇంజినీరింగ్​ పోస్టులు – పరీక్ష లేకుండానే జాబ్స్

ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్, అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ-2024

Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana

Venkaiah Naidu History: From ABVP President To Vice President Of India-2024 | ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం

AP People prepare to defeat YSRCP in 2024

AP People prepare to defeat YSRCP in 2024

AP People prepare to defeat YSRCP in 2024

AP People prepare to defeat YSRCP in 2024

 

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.