AP Intermediate Exams Hall Tickets Download from 21st February 2024 | ఈనెల 21న ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల..!
AP Intermediate Exams Hall Tickets Download from 21st February 2024: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. త్వరలో హాల్‌టికెట్లు కూడా విడుదలకానున్నాయి.
AP Intermediate Exams Hall Tickets Download-2024: ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ 2023 ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 2024 మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు 10వతరగతి పరీక్షలను కూడా మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం..
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 18-20 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ :
- మార్చి 1- శుక్రవారం – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
- మార్చి 4 – సోమవారం – ఇంగ్లిష్ పేపర్-1
- మార్చి 6 – బుధవారం – మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.
- మార్చి 9 – శనివారం – మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
- మార్చి 12 – మంగళవారం – ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1
- మార్చి 14 – గురువారం – కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ పేపర్-1
- మార్చి 16 – శనివారం – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
- మార్చి 19 – మంగళవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఏపీ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ :
- మార్చి 2 – శనివారం – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
- మార్చి 5 – మంగళవారం – ఇంగ్లిష్ పేపర్-2
- మార్చి 7 – గురువారం – మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2.
- మార్చి 11 – సోమవారం – మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
- మార్చి 13 – బుధవారం – ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
- మార్చి 15 – శుక్రవారం – కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ పేపర్-2
- మార్చి 18 – సోమవారం – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
- మార్చి 20 – బుధవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2
AP ఇంటర్ హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) అధికారిక వెబ్‌సైట్‌ని https://bie.ap.gov.in లో సందర్శించండి.
- “AP ఇంటర్ హాల్ టికెట్ ఫర్ 2024 సెషన్” లేదా ఇదే ఎంపికకు సంబంధించిన లింక్ కోసం చూడండి.
- లింక్‌పై క్లిక్ చేసి, మీ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ID వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- వివరాలను సమర్పించిన తర్వాత, మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- హాల్ టిక్కెట్‌పై పేర్కొన్న వివరాలను ధృవీకరించండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి.
- భవిష్యత్ సూచన కోసం హాల్ టికెట్ ప్రింటవుట్ తీసుకోండి.
AP Inter Exam Hall Tickets Download-2024
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ
AP Intermediate Exams Hall Tickets Download from 21st February 2024
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?