...

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

Written by lsrupdates.com

Published on:

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers part-3 in Telugu: TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్-2023 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు సమాధానాలతో పార్ట్-2 తెలుగులో తెలుసుకుందాం.

81. ఈ క్రింది బతలలో ఏది సరైనది కాదు :
A. సోమనాథ ఆలయం                                  : సాలంకీలు
B. కందారియ మహాదేవ ఆలయం                 : చౌహానులు
C. అయిహోల్ ఆలయం                              : బాదామి చాళుక్యులు
D. కోణార్క్ ఆలయం                                     : చందేలులు
(1) A మరియు B మాత్రమే
(2) B మరియు C మాత్రమే
(3) B మరియు D మాత్రమే
(4) A మరియు D మాత్రమే

Answer: 3

82. వరంగల్ కోట మరియు కోటలోని లోపల కట్టడములను పరిగణించుము :
A. వరంగల్ కోటలోని పిత్రాబాఖాన్చే నిర్మించబడ్డ ‘కుప్’ మహల్, మాందులోని ‘హిందోల మహల్ యొక్క నమూన.

B. ప్రతాపచరిత్ర, సిద్దేశ్వర చరిత్ర మరియు క్రీడాభిరామము వరంగల్ కోటను గురించి విలువైన సమాచారము తెలుపుచున్నాయి.

C. ప్రతాపచరిత్ర గ్రంథము ప్రకారము వరంగల్ కోటలో 88 బురుజులు (కొట్టలములు) కల్గియున్నవి.

D. శివయోగసారము అను గ్రంథము ప్రకారము వరంగల్ కోట శిలాఫలకమును గణపతిదేవుడు వేయించెను.

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A మరియు B మాత్రమే
(2) B మరియు C మాత్రమే
(3) C మరియు D మాత్రమే
(4) A మరియు D మాత్రమే

Answer: 1

83. “ఇల్ టుట్ మిష్ రెండు పాలరాతి సింహాల విగ్రహాలు చెక్కించాడు. వాటి మెడలో గంటలు కట్టించాడు. ఎవరైనా ఈ గంటలు మోగించి సుల్తాన్ నుండి న్యాయం పాండవచ్చు.” ఈ క్రింది రచయితలలో ఎవరు ఈ ప్రకటనను నమోదు చేశారు ?
(1) మిన్హాజ్-ఉన్-సిరాజ్
(2) ఇబ్న్ బటూటా
(3) ఇసామి
(4) మాలిక్ కుతుబ్-ఉద్-దిన్

Answer: 2

84. అయితే సింహాసనం లేక శవపేటిక (యా తక్ట్, యా తక్లా) అనే సామెత ఏ దేశానిది ?
(1) హిందుస్థాన్
(2) తుర్కిస్థాన్
(3) పర్షియా
(4) అరేబీయా

Answer: 3

85. క్రింది వాటిని జత పరుచుము :

చిత్రకారులు                        మోఘల్ రాజులు
A. మీర్ సయ్యద్ ఆలీ          I. హుమాయున్
B. దశవంత్                         II.అక్బర్
C. ఉస్తాద్ మన్సూర్            III. జహంగీర్
D. మీర్ హషిమ్                  IV. షాజహాన్

సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A-I; B-II; C-II; D-IV
(2) A-II; B-IV; C-I; D-III
(3) A-I; B-III; C-II; D-IV
(4) A-III; B-1; C-IV; D-II

Answer: 1

86. అబుల్ ఫజల్ ప్రకారము, ఉన్ని వస్త్రాలు తయారు చేయుటకు అక్బర్ వెయ్యి కార్ఖానాలను ప్రారంభిచెను. ఈ క్రింది ప్రదేశములలో ఎక్కడ వీటిని స్థాపించెను ?
(1) సూరత్
(2) ఢాకా
(3) లాహోర్
(4) అమృత్సర్

Answer: 3

87. ఈ క్రింది వ్యాఖ్యానాలలో సరైన సమాధానము/లు కనుగొనుము :
A. 1875 సంవత్సరములో ఆర్య సమాజ్ను స్వామి దయానంద సరస్వతి ప్రారంభించెను.
B. కర్మ కాండలను, మూఢ నమ్మకాలను వివేకానందుడు ఖండించెను.
C. హిందూ మత పునర్జీవనము మరియు బలోపేతానికి దివ్య జ్ఞానులు దోహదం చేసారు.
D. సిక్కు గురుద్వారాలను ప్రక్షాలణము చేసేందుకు 1920 లలో పంజాబ్లో ఆకాలీ ఉద్యమము
ప్రారంభమయింది.

సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A, B మరియు C
(2) A,  B మరియు D
(3) B, C మరియు D
(4) A, B, C మరియు D

Answer: 4

88. “భారతదేశం యొక్క ఈ వజ్రం, మహారాష్ట్ర యొక్క ఈ ఆభరణం ఈ కార్మికుల యువరాజు……. అతనిని చూసి అనుకరించడానికి ప్రయత్నించండి.” అని గోపాల కృష్ణ, గోఖలే గురించి ఎవరు వ్యాఖ్యానించారు?
(1) బి. ఆర్. నంద
(2) బాల్ గంగాధర్ తిలక్
(3) మహాత్మా గాంధీ
(4) జి. వి. జోషి

Answer: 2

89. దక్షిణ భారత దేశం నాట్యానికి సంబంధించిన స్వచ్ఛమైన శాస్త్రీయ పద్ధతులకు నిలయం. ఆంధ్ర మరియు తమిళనాడులలో, దేవదాశీలు ఒంటి నృత్యము మరియు నృత్య- నాటకములను ప్రదర్శిస్తు ఈ నృత్య సంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు. దక్షిణ భారత దేశంలో ఈ నృత్య నాటకాలను ఏమని పిలుస్తారు ?
(1) చౌ నృత్యము                (2) కురవంజీలు
(3) అంగిక అభినయం        (4) ఆలంబనం

Answer: 2

90. సిక్కులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము :

A. గోయింద్వాల్ గ్రామంలో గురు అమర్ దాస్ నిర్మించిన 84 మెట్ట బావి సిక్కుల మొదటి పుణ్య క్షేత్రం ఆయింది.
B. 1589 లో గురు ఆర్జన్ దేవ అమృత్సర్లో వార్మందిర్ సాహిబ్ దేవాలయం (స్వర్ణ దేవాలయం) నిర్మించాడు.
C. హర్మందిర్ సాహిబ్ ఎదురుగా ఆకాల్ తక్త్ అని పిలువబడే ఒక ఎత్తైన వేదికను గురు హర్గో విండ్ నిర్మించాడు.
D. 1699 లో గురు గోవింద్ సింగ్ శివాలిక్ పర్వత ప్రాంతంలోని ఆనంద పూర్లో ‘ఖాల్సా’ ను ప్రవేశ పెట్టి అక్కడ స్థిరపడ్డాడు.

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A మరియు B
(2) A, B మరియు C
(3) B, C మరియు D
(4) A, B, C మరియు D

Answer: 4

91. రాజ్యాంగంలోని కింది ప్రకరణలను వాటి సంబంధిత నిబంధనలతో జతపరచండి :
ప్రకరణ                          నిబంధన
A. ప్రకరణ-19         I. ప్రజాశాంతి, భద్రతలకు లోబడి మత కార్యకలాపాలు జరపడం
B. ప్రకరణ-21         II. మానవ ఆక్రమరవాణ, బలవంతపు వెట్టిచాకిరి నిషేధము
C. ప్రకరణ-23        III. వాక్ స్వాతంత్య్రం మొదలైన వాటికి సంబంధించిన కొన్ని హక్కులు
D. ప్రకరణ-26        IV. కొన్ని సందర్భాలలో అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ
V. వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుల రక్షణ
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A-III; B-V; C-II; D-I
(2) A-IV; B-III; C-I; D-II
(3) A-V; B-IV; C-II; D-II
(4) A-V; B-II; C-I; D-III

Answer: 1

92. వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు :
(1) రిట్ ఆఫ్ సెర్సియోరరీ దాఖలు చేయబడుతుంది.
(2) రిట్ ఆఫ్ హెబియస్ కార్బస్ దాఖలు చేయబడుతుంది.
(3) రిట్ ఆఫ్ మాండమస్ దాఖలు చేయబడుతుంది.
(4) రిట్ ఆఫ్ కోవారంటో దాఖలు చేయబడుతుంది

Answer: 2

93. ఈ క్రింది వాఖ్యాలను పరిగణించండి :
A. సామాజిక, ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యంతో కూడిన సమసమాజ స్థావనకు రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల కల్పనను అత్యున్నత. విలువలుగా ఆదేశిస్తుంది.
B. సమసమాజ సామాజిక క్రమాన్ని స్థాపించడానికి, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు అనే మాడు అంశాలు సామాజిక ఆర్థిక న్యాయ సాధన మార్గాన్ని సుగమం చేస్తాయి.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండు
(4) A మరియు B రెండూ కావు

Answer: 3

94. కింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధి కాదు ?
(1) రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జరిగే వివాదాలకు సంబంధించిన కేసులు
(2) రాజ్యాంగ వివరణకు సంబంధించిన కేసులు
(3) ఏ రాజ్యాంగ పరమైన ప్రశ్నలతో సంబంధం లేని సివిల్ కేసులు
(4) ఏ రాజ్యాంగ పరమైన ప్రశ్నలతో సంబంధం లేని క్రిమినల్ కేసులు

Answer: 1

95. కింది వారిలో భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు ఎవరు ?
A. అమర్జిత్ కౌర్
B. బేగం ఐజాజ్ రసూల్
C. హంసా జీవరాజ్ మెహతా
D. కమలా ముఖర్జీ
E. రేణుకా రే
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A, B, D మరియు E మాత్రమే
(2) A, C మరియు ID మాత్రమే
(3) B, C మరియు E మాత్రమే.
(4) B, C, D మరియు E మాత్రమే

Answer: 3

96. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కి సంబంధించి కింది వాటిని పరిగణించండి :
A. ఇది భారత సైన్యం చేపట్టిన ఒక అతిపెద్ద అంతర్గత భద్రతా మిషన్.
B. హర్మందిర్ సాహెబ్ కాంప్లెక్స్లో ఆయుధాలను పోగుచేసుకుంటున్న  సిక్కు తీవ్రవాదులను తొలగించడం దీని లక్ష్యం.
C. ఆపరేషన్ బ్లూస్టార్ జూలై 1 నుండి జూలై 8, 1985 మధ్య అమృత్సర్లో జరిగింది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
(1) A మరియు B మాత్రమే
(2) A, B మరియు C
(3) B మరియు C మాత్రమే
(4) B మాత్రమే

Answer: 1

97. శాసన మండలికి సంబంధించి కిందివాటిని పరిగణించండి :
A. కౌన్సిల్ శాశ్వత సభ, మూడింట ఒకవంతు సభ్యులు రెండేళ్ళలో పదవి విరమణ చేస్తారు.
B. శాసన మండలి మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒకవంతును స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు.
C. రాష్ట్రంలో నివసిస్తున్న మూడు సంవత్సరాల స్థాయి. పట్టభద్రులతో కూడిన ఒబర్ల ద్వారా వన్నెండవ వంతు సభ్యులు ఎన్నుకోబడతారు.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A, B మరియు C
(2) A మరియు B మాత్రమే
(3) A మరియు C మాత్రమే
(4) B మరియు C మాత్రమే

Answer: 1

98. ఈ కింది వారిలో ఎవరు తమ పదవిలో అధికారాలు, విధుల నిర్వహణ, పనితీరుపై ఏ న్యాయస్థానానికి జవాబుదారిగా ఉండరు ?
A. రాష్ట్రపతి
B. ప్రధాన మంత్రి
C. న్యాయ శాఖా మంత్రి
D. ఒక రాష్ట్ర గవర్నర్
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A, B మరియు C మాత్రమే
(2) A మరియు B మాత్రమే
(3) A మరియు D మాత్రమే
(4) A, B మరియు D మాత్రమే

Answer: 3

99. ఈ కింది వాటిని పరిగణించండి :
A. సామాన్యులకు నష్టం కలిగించే విధంగా సంవద కేంద్రీకరణను నిరోధించడం
B. బాల్యం, యువతకు దోపిడి నుండి రక్షణ
C. పౌరులందరికి తగిన జీవనోపాది మార్గాలు
D. సమాజపు భౌతిక వనర్తులను సాధారణ శ్రేయస్సు కొరకు సక్రమంగా వంపిణీ చేయడం
పై అంశాలు వీటిలో భాగం :
(1) రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు
(2) రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు
(3) రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితా
(1) రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు

Answer: 2

100. ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి :
A. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 356 ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించినది.
B. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సమయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించిన నిబంధనలను రాష్ట్రపతి నిలిపివేయ  వచ్చును.

పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు

Answer: 2

101. TSR సుబ్రమణియన్ కమిటి (2014) కింది వాటిలో దేనికి సంబంధించినది ?
(1) అంతర్గత, బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం ప్రయత్నాలు
(2) పర్యావరణం, ఆటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రక్రియలు, చట్టాలను సమీక్షించడం
(3) ముస్లిం వివాహ చట్ట రద్దు
(4) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రక్రియలు, చట్టాలను సమీక్షించడం

Answer: 2

102. ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి :
A. రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి, గవర్నర్ పై రాజ్యాంగం కల్పించని పదవులు, అధికారాలతో భారం వేయకూడదు.
B. గవర్నరు విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్ చేయడం, తద్వారా అతనికి / ఆమెకు అధిరాలను అప్పగించడం చారిత్రాత్మకంగా కొంత ఔచిత్యాన్ని కలిగి ఉన్నపటికీ నేడు కాల, పరిస్థితుల మార్పుతో అది ఉనికిని కోల్పోయింది.
పైన పేర్కొన్నవి క్రింది సిఫార్సులలో భాగం :
(1) జస్టిస్ ఎమ్.ఎమ్. పుంఛీ కమీషన్
(2) కొఠారి కమీషన్
(3) నూతన విద్యావిధానం- 2020
(1) నేషనల్ నాలెడ్జ్ కమీషన్

Answer: 1

103. ఈ కింది ఏ చట్టం అది రూపొందించబడిన సంవత్సరానికి సంబంధించి సరిగా జతపరచబడ లేదు?
(1) 2005 : సమాచార హక్కు చట్టం
(2) 2005: MGNREG చట్టం
(3) 2009: RTE చట్టం
41) 2012: జాతీయ ఆహార భద్రతా చట్టం

Answer: 4

104. డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (DMEO) లక్షాలు ఏవి ?
A. డేటా ఇన్ఫార్మెటిక్స్ సంబంధించిన కేంద్రీకృత డిపాజిటరీని అభివృద్ధి చేయడం
B. డేటా ఆధారిత విధాన రూపకల్పనను ప్రారంభించడం
C. వనితీరు కొలమానాల కఠినమైన ట్రాకింగ్ను సంస్థాగతీకరిండం
D. ప్రధాన స్రవంతి కఠినమైన ఫలితాల పర్యవేక్షణ, మూల్యాంకనానికి వ్యవస్థాపిత పూర్తి పరిసర సామర్ధ్యాలను బలోపేతం చేయడం

సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A, B మరియు C మాత్రమే
(2) A, C మరియు D మాత్రమే
(3) B మరియు D మాత్రమే
(4) B, C మరియు ID మాత్రమే.

Answer: 4

105. భారత ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు రెండూ స్వతంత్ర అధికార పబ్లిక్ రికార్డ్ ఆఫీన్ల స్థాపన కోసం, కింది వాటిలో ఏది సిఫార్సు చేసింది ?
(1) గిరీస్ రామాచంద్ర దేశ్పాండే vs. కేంద్ర సమాచార కమీషన్ పై సుప్రీం కోర్టు తీర్పు
(2) సువరిపాలనపై నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్
(3) రెండవ పరిపాలన సంస్కరణల కమీషన్
(4) సమాచార హక్కుపై పార్లమెంటరి జాయింట్ వర్కింగ్ గ్రూప్

Answer: 3

106. MGNREGA కి సంబంధించి కింది వాటిని పరిగణించండి : 
A. MGNREGA లో వేతనాలు పొందే వారు ప్రాథమిక వాటాదారులు.
B. MGNREGA లో కింద చేపట్టవలసిన పనులను ఫీల్డ్ ఆఫీసర్ సిపార్సు చేస్తారు. ఆఫీసర్ సిఫార్సు చేస్తారు.
C. గ్రామసభ పథకం అమలుపై సామాజిక తనిఖీని నిర్వహిస్తుంది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
(1) A మరియు B మాత్రమే
(2) A మరియు C మాత్రమే
(3) A, B మరియు C
(4) C మాత్రమే

Answer: 2

107. ఆయుష్మాన్ భారత్ లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల (HWC) సేవలు ఇవి :
A. గర్భధారణ, ప్రసవ సమయంలో సంరక్షణ
B. అంటు వ్యాధుల నిర్వహణ
C. ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ
D. మానసిక ఆరోగ్య వ్యాధి స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ.
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A, B, C మరియు D
(2) A మరియు B మాత్రమే.
(3) A మాత్రమే
(4) B మరియు C మాత్రమే.

Answer: 1

108. ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఫర్ ఎక్సపోర్ట్ స్కీమ్ (TIES) ప్రధానంగా దీని ద్వారా అమలు చేయబడుతుంది :
(1) మినిస్ట్రీ ఆఫ్ పిస్సింగ్, భారత ప్రభుత్వం
(2) మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారత ప్రభుత్వం
(3) విత్త మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
(4) రోడ్డు, భవనాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

Answer: 2

109. నీతి ఆయోగ్ సంస్థాగత ప్రేమ్ వర్క్ నకు సంబంధించి, ఈ కింది వాటిలో ఏది సరిగా జతపరచబడ లేదు ?
(1) ఛైర్పర్సన్ : భారత ప్రధాన మంత్రి
(2) పార్ట్-టైమ్ సభ్యులు : గరిష్ఠంగా ఇద్దరు
(3) ఎక్స్ ఆఫీషియో సభ్యులు : గరిష్ఠంగా నలుగురు
(4) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మూడేళ్ళ కాలానికి రాష్ట్రపతిచే నియమించబడతారు .

Answer: 4

110. భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి :
A. విదేశీ వాణిజ్య విధానం అనేది భారత దేశంలో వస్తువుల దిగుమతి, ఎగుమతికి సంబంధించిన విషయాలలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఏర్పాటు చేసిన మార్గదార్శకాలు, సూచనల సమూహం.
B. భారత ప్రభుత్వ విత్త మంత్రిత్వశాఖ ప్రతి ఐదు సంవత్సరాలకు ఎగుమతి, దిగుమతి విధానాన్ని ప్రకటిస్తుంది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు

Answer: 1

111. తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ?
A. 2020 – 21 తెలంగాణ బడ్జెట్లో, 65-4% వ్యవసాయ బడ్జెట్ రైతుబంధు కొరకు కేటాయించబడింది.
B. 2020 – 21 తెలంగాణ బడ్జెటలో, మొత్తం బడ్జెటలో 7-7% రైతుబంధు కొరకు కేటాయించబడింది.
C. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని 2016 వ సంవత్సరంలో ప్రారంభించింది.
D. 2020 వ సంవత్సరంలో, రైతుబంధు లబ్ధి దారులలో 80% చిన్న మరియు సన్నకారు (marginal and small) రైతులు ఉన్నారు.
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) D మాత్రమే
(2) B మాత్రమే
(3) A, B మరియు D మాత్రమే
(4) A మరియు C మాత్రమే

Answer: 2

112. తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ విధానం – 2016 యొక్క విస్తృత స్తంభాలకు సంబంధించి క్రింది వాటిని జత పరచుము.

స్తంభం పేరు                                                             స్తంభం సంఖ్య      
A. మానవ మూలధనం                                                    I. ఒకటి
B. భౌతిక మౌలిక వనరులు
మరియు ప్రోగ్రామ్ నిర్వహణ సామర్థ్యాలు                       II. మూడు
C. పెట్టుబడి నమూనాలు మరియు మూలధనం             III. రెండు
D. పరిశ్రమతో అనుసంధానం                                        IV. నాలుగు
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A-I; B-II; C-IV; D-III
(2) А-II; В-І; C-III; D-IV
(3) A-II; B-III; C-I; D-IV
(4) A-III; B-IV; C-II; D-I

Answer: 2

113. తెలంగాణ వస్త్ర మరియు దుస్తుల విధానం 2017 – 22 | క్రింద అందించే ప్రోత్సాహకాలకు సంబంధించిన క్రింది జతలను పరిగణించుము :

ప్రోత్సాహకం రకం                            ప్రోత్సాహకం
A. మూలధన రాయితీ                        40 కోట్ల రూపాయల వరకు
B. వడ్డీ రాయితీ                                  సంవత్సరానికి 6 శాతం చొప్పున 8 సంవత్సరాల వరకు
C. విద్యుత్ రాయితీ                            యూనిట్కు 1-5 రూపాయల వరకు
D. రాష్ట్ర వస్తు సేవల పన్నును
తిరిగి పొందటం                                7 సంవత్సరాల వరకు 100%

పై వాటిలోనుండి ఒప్పుగా బతపరిచిన జతలను ఎంపిక చేయుము :

1) A మరియు C మాత్రమే
(2) B మరియు D మాత్రమే
(3) A మరియు D మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 3

114. 2020 21 లో రంగాల వారీ TS-iPASS పెట్టుబడి (కోట్ల రూపాయలలో) ఆధారంగా క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుము :
A. సౌర మరియు ఇతర పునరుత్పాదక ఇంధనం
B. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు
C. ఎరువులు
D. ఫార్మాస్యూటికల్ మరియు రసాయనాలు
సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
(1) B, C, D, A
(2) B, A, D, C
(3) A, B, C, D
(4) C, D, B, A

Answer: D

115. కాకతీయుల కాలమునాటి ఈ క్రింది ప్రవచనములను పరిగణించుము ?
A. కాకతీయుల కాలంలో ప్రజలకు ప్రాతినిధ్యం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు సాధారణంగా వారిని ‘అష్టాదశప్రజలు’ గా సంభోదించేవారు.
B. ప్రజలు ఈ కాలంలో కార్పొరేట్ జీవన విధానాన్ని అవలంబించారు.
C. ఈ కాలంలో “సమయాచార’ అను పేరుతో కుల సంఘాలను ఏర్పరుచుకొని ఆయా సంఘ సభ్యుల భాగోగులు చూ-సేవారు.
D. బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా ‘అసమఖ్యాతులు’ అనే సంఘం పేరుతో పిలువబడేవి.
పై ప్రకటనలో ఏవి సరైనవి కావు ?
(1) A మరియు B
(2) B మరియు C
(3) C మరియు D
(4) A మరియు D

Answer: 3

116. తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తిగా క్రింది వాటిలో ఏది పరిగణించబడింది?

(1) చాపలు మరియు బుట్టలు ఆర్థిక
(2) వేట
(3) యాచించడం
(4) పొడు సాగు

Answer: 3

117. ‘పంజతన్-ఇ-పాక్’ అనగా నేమి ?
(1) ప్రతి ముస్లిం అనుసరించ వలసిన ఐదు ముఖ్యమైన విధులు.
(2) ప్రతి ముస్లిం అనుసరించే ఐదు ముఖ్యవిధులు ఆలమ్ (చిహ్నము) లో పొందు పరుచబడినవి. ఈ ఆలమ్ 15, 16 శతాబ్దములో దక్కన్లో సృష్టించబడింది.
(3) షియా ముస్లింలు విశ్వాసము ప్రకారము ఐదుగురు పవిత్రమైన వారు అనగా మొహమ్మద్, ఆలీ, ఫాతిమా, హసన్ మరియు హుసెన్ల పేర్లు ఆలమ్ (చిహ్నము) లో పొందు పరచడమైంది.
(4) దక్కన్లోని ముస్లింలు జరుపుకునే ఐదు ముఖ్యమైన పండుగలు.

Answer: 3

118. ఏ కాకతీయ సామంత పరిపాలకుల కుటుంబ చరిత్ర గురించి ‘శివయోగసారము’ వివరిస్తున్నది ?
(1) ఇందులూరి నాయకులు
(2) చెరకు నాయకులు
(3) కోట నాయకులు
(4) మల్యాల నాయకులు

Answer: 1

119. కాకతీయుల కాలంలో పండిత త్రయముగా పేరొందిన ముగ్గురు ఆచార్యులు ఎవరో గుర్తించుము ?
123. గిరిజన ఉప ప్రణాళికపై కింది ప్రకటనలను పరిగణించండి :
(1) మల్లిఖార్జున వండితుడు, పాలకురికి సోమనాథుడు మరియు విశ్వేశ్వర పండితుడు
(2) శ్రీపతి పండితుడు, మల్లిఖార్జున పండితుడు మరియు మంచన పండితుడు
(3) విశ్వేశర పండితుడు, మల్లిఖార్జున పండితుడు మరియు మంచన పండితుడు
(4) శ్రీపతి పండితుడు, పాలకురికి సోమనాథుడు మరియు మంచన పండితుడు

Answer: 2

120, ఈ క్రింది జతలను పరిగణించండి : 
చర్చిలు                                                  హైదరాబాద్లోని ప్రాంతం
A. సెయింట్ జాన్స్ చర్చి                             బొల్లారం
B. హోలి ట్రినిటి చర్చి                                తిర్మలగిరి
C. సెయింట్ మేరి చర్చి                               సికింద్రాబాద్
D. సెయింట్ జార్జి చర్చి                               అబిడ్స్

సరైన జతను ఎంచుకొండి :

(1) A మరియు B
(2) B మరియు C
T3) C మరియు D
(4) A మరియు D

Answer: 3

121. కుతుబ్ షాహీ కాలంలో, హిందు మరియు ముస్లిం ప్రముఖులు ఇద్దరూ “కులా ” మరియు “ఖబా” లతో కూడిన దుస్తులను ధరించేవారు. ఈ రెండు వదాల అర్థం ఏమిటి ?
(1) టోపి మరియు పొడవైన కోటు
(2) ప్యాంటు మరియు బెల్ట్
(3) చొక్కా మరియు ధోతీ
(4) హెఙ్బ్యాండులు మరియు టై

Answer: 1

122. 19 వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్లో జోరాష్ట్రియన్ ఇరానీ వలసదారులు ఏ వంటకాన్ని పరిచయం చేశారు ?
(1) బిర్యానీ
(2) హలీమ్
(3) ఖుబానీ కా మీఠా
(4) చాయి

Answer: 4

123. గిరిజన ఉప ప్రణాళికపై కింది ప్రకటనలను పరిగణించండి :

A. గిరిజన ఉపప్రణాళిక 1974-75 లో అమలులోని వచ్చింది.
B. ప్రణాళిక మరియు ప్రణాళికేతరాలు విలీనమైన తర్వాత గిరిజన ఉపప్రణాళికను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్ (STC) భాగంగా మార్చారు.
C. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రాష్ట్ర ప్రణాళికకు సంబంధించి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల జనాభా (సెన్సస్ 2011) నిష్పత్తిలో గిరిజన ఉపప్రణాళిక నిధులను కేటాయించాలి.
D. 2018 – 19 ఆర్థిక సంవత్సరంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు షెడ్యూల్డ్ తెగ కాంపోనెంట్ ప్లాన్ పర్యవేక్షణ ఇవ్వబడింది.
పై ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A, B మరియు C మాత్రమే
(2) A, B మరియు D మాత్రమే
(3) A, C మరియు D మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 3

124. జత పర్చుము :
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG లు)                   లక్ష్యాలు 

A. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2-2        I. ప్రపంచ ప్రసూతి మరణాల నిష్పత్తిని ప్రతి 1,00,000                                                                      సజీవ జననాలకు 70 కంటే తక్కువకు తగ్గించడం
B. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 3-1        II. లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలకు                                                                సార్వత్రిక ప్రావ్యతను నిర్ధారించడం
C. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 3-3        III. అన్ని రకాల పోషకాహార లోపాలకు స్వస్తి
D. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 3-7        IV. ఎయిడ్స్, క్షయ, మలేరియా మరియు నిర్లక్ష్యం                                                                              చేయబడిన ఉష్ణమండల అంబువ్యాధులను అంతం                                                                    చేయడం.
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) Α-ΙΙ; Β-Ι; C-IV; D-III
(2) A-III; B-1; C-IV; D-II
(3) A-III; B-I; C-II; D-IV
(4) A-III; B-IV; C-I; D-II

Answer: 2

125. ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్ 2019 ప్రకారం ఈ క్రిందివారిలో ఎవరు ట్రాన్స్ జెండర్ పర్సన్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని జారీ చేయవచ్చు :
(1) ఏరియా ఆసుపత్రి ఛీప్ మెడికల్ ఆఫీసర్
(2) ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్
(3) జిల్లా మేజిస్ట్రేట్
(4) ఎన్నికైన గ్రామ సర్పంచ్ లేదా మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్

Answer: 3

126. మహిళల పని గురించి కింద ఇచ్చిన ప్రకటనలను పరిగణించండి :
A. OECD నివేదిక ప్రకారం, సంరక్షణ పనిలో పురుషుల | కంటే మహిళలు రెండు నుండి పది రెట్లు ఎక్కువ సమయాన్ని గడుపుతారు.
B. NSS 2019 నివేదిక ప్రకారం మహిళలు వేతనం లేని గృహ సేవలో 299 నిమిషాలు గడుపుతుండగా, పురుషులు 97 నిమిషాలు గడుపుతున్నారు.
C. గ్లోబల్ జెండర్ గ్యాప్ (2021) ప్రకారం భారత్లో కేవలం 22-3% మంది మహిళలు మాత్రమే లేబర్ | మార్కెట్లో పాల్గొంబున్నారు.
D. ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ (PMGDISHA) గ్రామీణ ప్రాంతలలోని మహిళలు ఇంటి వద్ద సంరక్షణ పనిలో ఎక్కువ సమయం గడవడానికి వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పై ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A, B మరియు C మాత్రమే
(2) A, B మరియు ID మాత్రమే
(3) A, C మరియు D మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 1

127. కార్మిక (నిషేధం మరియు నిర్మూలన) చట్టం ను, 1986 లో సిఫారసు చేసింది ఎవరు ? 
(1) దవే కమిటి
(2) కొఠారి కమిషన్
(3) నర్సింహన్ కమిటీ
(4) గురుపాదస్వామి కమిటి

Answer: 4

128. మాన్యువల్ స్కావెంబర్ల ఉపాధిని నిషేధించడం మరియు వారి పునరుద్ధరణ చట్టం, 2013 లోని క్లాజ్ 9 ఈ విధంగా పేర్కోంది
(1) క్లాజ్ 5 లోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు లక్షల రూపాయిల వరకు జరిమాన లేదా రెండు విధించవచ్చు.
(2) క్లాజ్ 6 లోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమాన. లేదా రెండూ విధించవచ్చు.
(3) క్లాజ్ 7 లోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమాన లేదా రెండూ విధించవచ్చు
(4) క్లాజ్ 8 లోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమాన లేదా రెండూ. విధించవచ్చు.

Answer: 4

129. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబిల్డ్ చిల్డ్రన్ (IEDC) పథకాన్ని ఏ సంవత్సరం ప్రారంభించారు.
(1) 1970
(2) 1974
(3) 1984
(4) 1994

Answer: 2

130. జెండర్ (లింగ) సమానత్వం దేనికి దోహదం చేస్తుంది :

A. శాంతియుత మరియు స్థితిస్థాపకత సమాజాలను సాధించడం.
B. సుస్థిర అభివృద్ధి
C. ఆర్థిక వృద్ధి
D. మహిళా ఆధిపత్యం

పై వాటిలో ఏవి సరైనవి ?
(1) A, B మరియు C మాత్రమే
(2) A, C మరియు 1) మాత్రమే
(3) A, B మరియు D మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 1

131. క్రింది శ్రేణిలో తరువాత వచ్చే సంఖ్య ఏది ?

9, 1-5, 13-5, 74-25, 594, ?
(1) 6237          (2) 5940
(3) 6534          (4) 6831

Answer: 1

132. క్రింది శ్రేణిలో తప్పిపోయిన సంఖ్యని కనుక్కోండి ?

7, 8, 20, ?, 292, 1485
(1) 50            (2) 55
(3) 15            (4) 69

Answer: 4

133. క్రింది శ్రేణిలో ఇమడని సంఖ్యని కనుక్కోండి :

5, 12, 51, 311, 2497, 24961
(1) 51              (2) 311
(3) 2497          (4) 24961

Answer: 3

134. ఒక వేళ P = +, Q = x, R = ÷, S = – మరియుT =% యొక్క’ అయితే 
225 Q 3 R 15 S 20 P 67 S 20 T 160 విలువ ఎంత ?
(1) 45            (2) 50
(3) 55            (4) 60

Answer: 4

135. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో GENETICS అనే పదాన్ని HCQAYCJK  గా కోడ్ చేస్తే, అదే భాషలో ANALYTICS యొక్క కోడ్ ఏంటి ?
(1) BLDDHNPUB
(2) BLDHDNPVB
(3) BLDHENPUB
(4) BLDDHNPVB

Answer: 4

136. ఒక వేళ, జూన్ 15, 2023 గురువారం అయితే అక్టోబర్ 24, 2028 న ఏ వారం అవుతుంది ?
(1) బుధవారం
(2) గురువారం
(3) శుక్రవారం
(4) మంగళవారం

Answer: 4

137. క్రింది ఇచ్చిన బార్ చార్ట్లో ఒక కుటుంబం యొక్క నెలసరి ఖర్చులు (వేల రూపాయల్లో) ఐదు నెలలు ఆయిన రెండు సంవత్సరాల కాలానికి ఇవ్వబడ్డాయి. 2021, 2022 సంవత్సరాల సగటు నెలసరి ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత ?

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3
TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

(1) 33 : 37              (2) 34 : 39
(3) 32 : 37              (4) 34 : 37

Answer: 2

138. ఒక గడియారం ప్రతిగంబకి 5 నిమిషాలు కోల్పోతుంది. ఆ గడియ-రంలో బుధవారం ఉదయం 8 గంటలకు సరైన సమయాన్ని చూపెట్టేలా సరిచేస్తే, మళ్ళీ ఆ గడియారం సరైన సమయాన్ని ఎప్పుడు చూపుతుంది ?
(1) ఉదయం 8 గంటలు, మంగళవారం
(2) సాయంత్రం 8 గంటలు, మంగళవారం
(3) ఉదయం 8 గంటలు, బుధవారం
(4) సాయంత్రం 8 గంటలు, బుధవారం

Answer: 1

139. ఒక పెద్ద ఘనానికి ఆరు వైపులా రంగు వేసి, దాన్ని ఒక నిర్దిష్ట సంఖ్యలో సమానమైన చిన్న ఘనాలుగా కత్తిరించారు. ఆ చిన్న ఘనాల్లో, 8 ఘనాలకు ఏ ముఖానికి కూడా రంగు వేయలేదు. రెండు ముఖాలకు మాత్రమే రంగు వేయబడ్డ చిన్న ఘనాలెన్ని?
(1) 6          (2) 12
(3) 18        (4) 24

Answer: 4

140. ఒక వేళ AB39+ C6B8B = 4292C అయితే A + 2B + 3C విలువ ఎంత ? (A, B మరియు C అనే ముడు అక్షరాలు 1 నుండి 9 వరకు గల అంకెల్లో మూడు వివిధ అంకెలను సూచిస్తాయి. ఏ అంకె కూడా ఒక అక్షరం కంటే ఎక్కువ అక్షరాలను సూచించదు)
(1) 23      (2) 24
(3) 21      (4) 22

Answer: 1

141. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో SORT ని 2169 గా, TEST ని
5122 గా, DOG ని 368 గా, GOAT ని 6243 గా కోడ్ చేస్తే, అదే భాషలో ROAST ని ఏవిధంగా కోడ్ చేస్తారు ?
(1) 91463          (2) 64829
(3) 21946          (4) 49623

Answer: 3

142. రెండు ప్రకటనలు, I, II, III మరియు IV నే నాలుగు ముగింపులు క్రింద ఇవ్వబడ్డాయి. ప్రకటనలను జాగ్రత్తగా చదివి సాధారణంగా తెలిసిన వాస్తవాలను విస్మరించి, తార్కికంగా ఏ  ముగింపులు అనుసరిస్తాయె నిర్ణయించండి. 

ప్రకటనలు :
ఏ పులి కుడా ఏనుగు కాదు.
ఏనుగులు అన్ని సింహాలు.
ముగింపులు :
I. కొన్ని సింహాలు పులులు.
II. అన్ని సింహాలు పులులు.
III. కొన్ని సింహాలు ఏనుగులు.
IV. కొన్ని సింహాలు ఏనుగులు కావు.
(1) ముగింపులు I మరియు II మాత్రమే అనుసరిస్తాయి.
(2) ముగింపులు I, II మరియు III మాత్రమే అనుసరిస్తాయి
(3) ముగింపులు III మరియు IV మాత్రమే ఆనుసరిస్తాయి
(4) ముగింపులు II, III మరియు IV మాత్రమే అనుసరిస్తాయి

Answer: 3

143. రామ్, శ్యామ్ ల వయస్సుల లబ్దం 210. రామ్ వయస్సు, కంటే, రెండు  రేట్ల శ్యామ్ వయస్సు 4 సంవత్సరాలు ఎక్కువ అయితే, శ్యామ్ వయస్సు ఎంత ? (సంవత్సరాల్లో)
(1) 12          (2) 20
(3) 24          (4) 44

Answer: 1

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3
TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

Answer: 4

145. A, B, C, D, E మరియు F అనే ప్రదేశాలు వివిధ సమూహాలు లేదా వివిధ గుర్తింపులు కలిగి ఉన్నాయి. A హిల్ స్టేషన్ కాదు. B మరియు E లు చారిత్రాత్మక ప్రదేశాలు కావు, D మరియు F లు పారిశ్రామిక నగరాలు కావు. A మరియు D లు చారిత్రాత్మక ప్రదేశాలు కావు. A మరియు B లు ఒకే విధంగా ఉంటాయి. చారిత్రాత్మక ప్రదేశం కాని, హిల్ స్టేషన్ మరియు పారిశ్రామిక నగరం అయిన ప్రదేశం ఏది ?
(1) B          (2) E
(3) F          (4) C

Answer: 2

146. క్రింది శ్రేణిలో తప్పిపోయిన పదాన్ని కనుక్కోండి : ANBO,____________ ,DQER, FSGT
(1) CPDQ
(2) CRGT
(3) CPRS
(4) СРВО

Answer: 1

147. ఒక వ్యక్తి, ఒక ఫొటోలో ఉన్న బాలున్ని చూపిస్తూ ఈ విధంగా చెప్పెను, “ఈ ఫొటోలో ఉన్న బాలుడు, నా సోదరుని తండ్రి యొక్క కుతురి యొక్క కొడుకు.” ఆ వ్యక్తి, ఫొటోలో ఉన్న బాలుడికి ఏమవుతాడు ?
(1) తండ్రి                (2) సోదరుడు
(3) మేన మామ        (4) తాత

Answer: 3

148. రాము తన కొడుకు అయిన రాఘవతో ఈ విధంగా చెప్పెను, “నువ్వు పుట్టినప్పుడు నా వయస్సు, నీ ప్రస్తుత వయస్సులో సగము.” రాము యొక్క ప్రస్తుత వయస్సు 60 సంవత్సరాలు అయితే రాఘవ పుట్టినప్పుడు రాము వయస్సు ఎంత ? (సంవత్సరాల్లో)
(1) 20        (2) 22
(3) 25        (4) 19

Answer: 1

149. ఒక వేళ 25 #5 = 5, 10 @ 2 = 20, 5 & 3 = 8 మరియు 10 $ 6 = 4, అయితే క్రింది దాని విలువ ఎంత? 20 $ 6 @1& (20 #10)
(1) 20      (2) 18
(3) 16      (4) 22

Answer: 3

150. క్రింది శ్రేణిలో అన్ని రెండు అంకెల సంఖ్యల మొత్తం ఎంత ?
1, 8, 15, 22, ….
(1) 750            (2) 759
(3) 741            (4) 742

Answer: 3

Also Read 👇👇

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 # TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 # TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

#TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 # TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 # TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

1 thought on “TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.