...

‘రజాకార్’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024

Written by lsrupdates.com

Published on:

‘రజాకార్’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024

Razakar Movie Review & Rating in Telugu-2024: చరిత్రను తవ్వుకుంటూ ముందుకెళ్తూ.. అందులో నీ, నా మూలాలను వెతుక్కుంటూ.. నివ్వెర పోయే నిజాలు, ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు తెలుసుకుంటూ.. నిజాం ప్రభువుల నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకత్వాన్ని కళ్లకి కట్టిన సినిమా ఈ ‘రజాకార్(Razakar )’.

చిత్రం: రజాకార్ (Razakar)

విడుదల తేదీ : 15 March 2024

నటీ నటులు: తేజ్ సప్రూ, బాబీ సింహ, రాజ్ అర్జున్, మకరంద్ దేశ్‌పాండే, అనసూయ, వేదిక, ప్రేమ, తలైవాసల్ విజయ్, రవి ప్రకాష్, సంతోష్ పవన్  తదితరులు

సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరిలీయో

సినిమాటోగ్రాఫర్: కుషేందర్ రమేష్ రెడ్డి

ఎడిటర్ : తమ్మి రాజు

బ్యానర్: సమర్ వీర్ క్రియేషన్స్

నిర్మాత: గూడూర్ నారాయణ్ రెడ్డి

దర్శకత్వం: యాట సత్యనారాయణ

సినిమా శైలి: Telugu, Drama, History

వ్యవధి: 2 Hrs 35 Min

Razakar Movie Review & Rating in Telugu-2024

‘రజకార్'(Razakar) మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రజలకు మాత్రం స్వతంత్య్రం లభించలేదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందూస్థాన్‌లో కలవాలని ఉన్నా.. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం  మాత్రం స్వతంత్ర దేశంగా ఉండాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ గూడూరు నారాయణ రెడ్డి ఎంతో సాహోసపేతంగా ‘రజాకార్’ సినిమాను నిర్మించారు. అదే రేంజ్‌లో యాట సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం(Razakar Movie Review & Rating in Telugu-2024)..

'రజాకార్' మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024
‘రజాకార్’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024

‘రజకార్’ కథేంటంటే..

1947లో బ్రిటిష్ వాళ్లు వెళుతు వెళతూ.. దేశాన్ని భారత్, పాకిస్థాన్ అంటూ రెండు దేశాలుగా విభజించి మనకు స్వాతంత్య్రం ఇచ్చారు. అప్పటికే దేశంలో 500పైగా స్వతంత్ర్య సంస్థనాలు భారత్‌లో కలవాని ప్రకటన చేసి మరి వెళ్లింది.ఇక దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్ధార్ వల్లభబాయ్ పటేల్ అత్యంత చాకచక్యంతో దేశంలోని 500 పైగా సంస్థానాధీశులతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేసారు. కానీ దేశంలో కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థానలు మన దేశంలో విలీనం కాకుండా మొండి కేసాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన కొన్ని రోజులకే కశ్మీర్ పై పాకిస్థాన్ వాళ్లు అటాక్ చేసారు. అపుడు కశ్మీర్ రాజు మన దేశంలో కలుస్తానని ప్రకటన చేసారు. ఆ తర్వాత జునాఘడ్ కూడా భారత్‌లో విలీనమైంది.

కానీ హైదారబాద్‌ను పరిపాలిస్తోన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేస్తానని ప్రకటన చేసారు. అంతేకాదు హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర తుర్కిస్థాన్ పేరుతో ఓ దేశంగా ఏర్పాటు చేయాలనకుంటాడు. అంతేకాదు తన సంస్థానంలో మెజారిటీ ప్రజలుగా ఉన్న హిందువులపై నిజాం ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ పేరుతో ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేస్తాడు.వారు ఏ విధంగా ఇక్కడ ప్రజలను హింసించారు. ఇక్కడ ప్రజలు నిజాం ప్రైవేటు సైన్యంపై ఏ రకంగా తిరుగుబాటు చేసారు. అక్కడ జరగుతున్న ఆగడాలను తెలుసుకున్న అప్పటి కేంద్రం హోం మంత్రి సర్ధార్ పటేల్ జే.ఎన్. చౌదరి నేతృత్వంలో హైదరాబాద్ విముక్తి కోసం ఆపరేషన్ పోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాం ప్రభువు మన సర్ధార్ పటేల్ ముందు ఎలా లొంగిపోయి.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో ఎలా విలీనం చేసాడనేదే ఈ సినిమా కథ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

చరిత్రను కళ్లకు కట్టినట్టు తెరకెక్కించడం అంత ఆషామాషీ కాదు. అలాంటిది హైదరాబాద్ సంస్థానంలో 1947 ఆగష్టు 15 నుంచి నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్ నేతృత్వంలో ఇక్కడ మెజారిటీ ప్రజలపై ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడిండనే విషయం చెప్పడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. దాన్ని కార్యరూపం దాల్చడంలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిని ముందుగా అభినందించాలి. మాములుగా  సినిమా తీయడానికి డబ్బులు ఉండే సరిపోతాయి.

కానీ చరిత్రలో జరిగిన చీకటి కోణాన్ని తెర రూపం ఇవ్వడం మాములు విషయం కాదు.. అందుకు డబ్బులు మాత్రమే కాదు.. ఖలేజా కూడా ఉండాలి. ఇలాంటి సినిమాతో మన చరిత్రను ప్రజల ముందు ఉంచిన గూడూరు నారాయణ రెడ్డి గట్స్‌కు మెచ్చుకొని తీరాల్సిందే. అప్పట్లో హైదరాబాద్ అంటే తెలంగాణలో 8 జిల్లాలు ఉండేవి. మహారాష్ట్రలో 5 జిల్లాలు.. కర్ణాటకలోని మూడు జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి. మొత్తంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 నెలలకు హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది. ఇక నిజాం వ్యతిరేక పోరాటంలో హిందువులతో పాటు తురేబాజ్ ఖాన్, షోయబుల్లా ఖాన్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

'రజాకార్' మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024
‘రజాకార్’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024

ఈ సినిమాను నిర్మించడం వరకు ఓకే కానీ.. దాన్ని ప్రజలకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి తొలి సినిమాతోనే మంచి మార్కులే కొట్టేసాడు దర్శకుడు యాట సత్యనారాయణ. ఇలాంటి చరిత్రకు సంబంధించిన సినిమాను తెరకెక్కించడం కత్తి మీద సాము లాంటిదే. అప్పటి కాలానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ నుంచి ఆర్ట్ వర్క్ అప్పటి పల్లె ప్రాంతాలు.. అన్ని తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో ప్రతి ఫేము అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా రజాకర్ సైన్యం హైదరాబాద్ సంస్థానంలోని మౌలాలి ప్రాంతంలో ట్రైనింగ్ ఎలా ఇప్పించారు. అప్పటి ప్రజలను బలవంతంగా ఎలా ఇస్లామ్‌లోకి మార్చబడ్డారనే విషయాన్ని ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేసాడు.

డైరెక్టర్ యాట సత్యనారాణ మొదటి సినిమా కానీ కథను ప్రెసెంట్ చేసిన విధానం , పాత్రల ఎంపిక , 1948 నాటి స్క్రీన్ ప్లే  తీసుకురావడం లో డైరెక్టర్  వందకు వంద శాతం సక్సెస్ అయ్యేడని చెప్పాలి. రజాకార్ల క్రూరత్వం , తెలంగాణ ప్రజల ఆవేశం , తిరుగుబాటు లో వచ్చే ఎమోషన్ ని  డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ బాగా కాప్చర్ చేసారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఓ హీరో పాత్ర.. అతని తిరుగుబాటు.. వాళ్లకో ఎలివేషన్ సీన్స్.. ఫైట్స్.. వాళ్లు చనిపోవడం వంటివి చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు.

ముఖ్యంగా చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటనల్లో కొన్ని ఏరికూరి ఈ సినిమాను(Razakar Movie Review & Rating in Telugu-2024) పూల దండలా తయారు చేసాడు. ముఖ్యంగా మహిళలతో వివస్త్రలను చేసి బతుకమ్మను ఆడించడం.. బైరాన్‌పల్లి నరమేధాన్ని ఈ సినిమాలో ప్రతి సీన్ ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. అటు అప్పట్లో రజాకార్లపై పోరాడేవాళ్ల ఇండ్లో గోమాతను నరికి వాళ్ల ఇంట్లో రక్తపాతం క్రియేట్ చేయడం.  క్లైమాక్స్ లో ఆపరేషన్ పోలో సందర్భంగా భారత్ ఆర్మీకి ఇక్కడ ప్రజలు జేజేలు పలకడం వంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మొత్తంగా అప్పట్లో మనం పేపర్లో టీవీల్లో చూసిన దాన్ని తెరపై అలాగే ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

'రజాకార్' మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024
‘రజాకార్’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024

దీనికి తోడు భీమ్స్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అనసూయతో బతుకమ్మ పాట హైలెట్.  గూస్ బంప్స్  సీన్స్ , సెంటిమెంట్ సీన్స్ మూవీ కి హైలైట్ అని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇచ్చిన పాటలు కూడా మూవీ కి ఎంతో ప్లస్. వీఎఫ్‌ఎక్స్ తో పాటు సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా  యుద్ధ సన్నివేశాల్లో స్టంట్ మాస్టర్స్ ఎఫెక్ట్ మాత్రం స్క్రీన్ ఫై బాగా కనిపిస్తుంది ఎక్కడ కూడా నటిస్తున్నారనే డౌట్ రాదు .

ఎవరెలా చేశారంటే..

ఈ సినిమాలో(Razakar Movie Review & Rating in Telugu-2024) ముందుగా చెప్పుకోవాల్సింది కాసీం రజ్వీ పాత్రను చేసిన రాజ్ అర్జున్. ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. నిజంగా రజాకార్ వచ్చిన నటించాడా అనే రీతిలో తన క్యారెక్టర్‌తో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాత్రలో నటించిన మకరంద్ దేశ్‌పాండే తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక సర్ధార్ పటేల్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు తేజ్ సప్రూ నటన ఆకట్టుకుంటుంది. ఇక అనసూయ చేసింది కాసేపు అయినా.. ఈ సినిమాలో గుర్తుండి పోతుంది. మరోవైపు చాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ, బాబీ సింహా, నిజాంపై బాంబు వేసిన నారాయణ్ రావు పవార్ పాత్రలో నటించిన నటుడు ఇలా చెప్పుకుంటూ పోతే.. అందరు తమ పాత్రలకు న్యాయం చేసారు.

బలాలు

కథ, కథనం

నటీనటుల నటన

ఎమోషన్ కమ్ ఎలివేషన్ సీన్స్

ఇంటర్వెల్ బ్యాంగ్

క్లైమాక్స్

బలహీనతలు

అక్కడక్కడ వీఎఫ్‌ఎక్స్ సీన్స్

కొన్ని రిపీట్ సన్నివేశాలు

పంచ్ లైన్ : ‘రజాకార్’ సినిమా కాదు.. చరిత్ర.. పిడికిలి బిగిస్తే రజాకార్ల పైజామాలు  ఊడాలె..

చివరగా..

“రజాకార్”  మూవీ ఒక ఫైల్డ్  డాక్యూమెంటరీ అని చెప్పాలి , ఈ మూవీ    చరిత్ర తెలియని వాళ్ళకి  తెలియచేస్తుంది , చరిత్ర తెల్సిన వాళ్లకి గుర్తు చేస్తుంది .  ఒక ప్రాంతానికి సంబందించిన మూవీ గా కాకుండా,  మూవీ లవర్స్ కూడా చూడాల్సిన సినిమా ,టెక్నికల్  గా కూడా అప్డేటెడ్ మూవీ  భావి తరాలకి మన చరిత్రను అందించిన సినిమా …   తప్పక చూడాల్సిన సినిమా ..

'రజాకార్' మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024
‘రజాకార్’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024

 

రేటింగ్: 3.5/5

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ | Operation Valentine Movie Review in Telugu-2024

Razakar Movie Rating

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.