శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర | Biography of Sri Nara Chandrababu Naidu-2024
Biography of Sri Nara Chandrababu Naidu-2024: నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. అతను ఇండియా టుడే నుండి “ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం”, ద ఎకనమిక్ టైమ్స్ నుండి “బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్”, టైమ్స్ ఆసియా నుండి “సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్”, ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. అతను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
Biography of Sri Nara Chandrababu Naidu-2024
తెలుగుదేశంపార్టీ(TDP)
నందమూరి తారక రామారావు(NTR) తెలుగుదేశం పార్టీని 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు.
1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ(TDP) ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీ(TDP)లో చేరాడు. తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు.
పార్టీలో ఎదుగుదల
1984లో ఎన్టీఆర్(NTR) గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌తో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశాడు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన రాంలాల్ ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తెలుగు దేశంపార్టీ(TDP) శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు.
ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు, చంద్రబాబునాయుడుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కరరావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు తెలుగు దేశం పార్టీ(TDP)లో ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసాడు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంత మెజారిటీ లేక పోవడంతో, ప్రతిపక్ష హోదాతో శాసన సభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్(NTR) ప్రకటించడంతో, నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు.
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం(TDP) శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్(NTR) ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్(NTRపై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది.
1 thought on “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర | Biography of Sri Nara Chandrababu Naidu-2024”