కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు, యువతకు ప్రాధాన్యం..ఇలా 10 వాగ్దానాలతో | Rahul Gandhi announces 10-point poll promise for youth and unemployed in MP-2024
Rahul Gandhi announces 10-point poll promise for youth and unemployed in MP-2024: కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ను ఈసారి ఎన్నికల్లో గద్దె దింపాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమిని ఏర్పాటు చేసి నరేంద్ర మోదీని ఢీకొట్టాలని యోచిస్తోంది.
Rahul Gandhi announces 10-point poll promise for youth and unemployed in MP-2024
ఇక గత 10 ఏళ్ల మోదీ పాలనకు సంబంధించి నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే అస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ తరచూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలకు అవే ప్రచార అస్త్రాలుగా చేసుకున్న హస్తం పార్టీ.. దేశంలోని నిరుద్యోగులు, యువతను ఆకట్టుకునేలా ఎన్నికల మేనిఫేస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు, ఉపాధి సహా 10 అంశాలతో కూడిన ఎన్నికల హామీలను ప్రకటించేందుకు సిద్ధమైంది.
10 Points in Congress Manifesto-కాంగ్రెస్ మేనిఫెస్టో
ముఖ్యంగా దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోయి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగ యువతను తమవైపు తిప్పుకునేలా ఎన్నికల హామీలను రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే దేశంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టేలా క్షేత్రస్థాయిలో లక్ష మంది బూత్ లెవల్ ఏజెంట్లను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు.. ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి మరో జాబితా వెలువరించేందుకు సిద్ధం అవుతుండగా.. కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తం అయింది. ఈ క్రమంలోనే కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకుందని.. గురువారం మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయి వాటిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అధ్యక్షతన మేనిఫేస్టో కమిటీ ఏర్పాటు చేయగా.. ఆ మేనిఫేస్టోను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి అధ్యక్షుడికి అందజేయనున్నారు.
ఎంఎస్పీకి చట్టపరమైన హామీ..
ఇక వచ్చే వారం నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటర్లలోని వివిధ రకాల వయసుల వారిని ఆకర్షించేందుకు రకరకాల కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రస్తుతం రైతుల ఆందోళనలు కొనసాగుతుండగా.. తాము అధికారంలోకి వస్తే రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర-ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇస్తామని తెలిపే హోర్డింగ్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. తాము గెలిస్తో ఎంఎస్పీకి చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Rahul Gandhi announces 10-point poll promise for youth and unemployed in MP-2024
Rahul Gandhi announces 10-point poll promise for youth and unemployed in MP-2024
Rahul Gandhi announces 10-point poll promise for youth and unemployed in MP-2024
కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు, యువతకు ప్రాధాన్యం..ఇలా 10 వాగ్దానాలతో