పీపీఎఫ్,ఎన్ పి ఎస్, SSY కడుతున్నారా? కనీస మొత్తం జమ చేయడానికి మార్చి 31 డెడ్‌లైన్..! PPF NPS Sukanya Samriddhi rules for deposit minimum Amount-2024
PPF NPS Sukanya Samriddhi rules for deposit minimum Amount-2024: కేంద్ర ప్రభుత్వం అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన(SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి మార్చి 31 ముఖ్యమైన తేదీగా చెప్పొచ్చు. ఆలోగా కనీస మొత్తం జమ చేయకుంటే.. ఖాతాలు స్తంభించిపోతాయి. ఇంకా పెనాల్టీ కూడా పడుతుంది.
PPF NPS Sukanya Samriddhi rules for deposit minimum Amount-2024
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం అండగా ఉండేందుకు పొదుపు పథకాల్ని తీసుకొచ్చింది. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) సహా సుకన్య సమృద్ధి అకౌంట్(SSY), ఎన్పీఎస్(NPS) వంటి పథకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షల్లో పన్ను ఆదా చేసుకోవచ్చు. అందుకే వీటిల్లో డిపాజిట్లు చేసే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంటుంది. అంటే కొత్తగా అకౌంట్లు తెరిచేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. వీటిల్లో వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఓసారి కేంద్రం సవరిస్తుంటుంది.
మార్చి 31 డెడ్‌లైన్..
ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ మీరంతా తెలుసుకోవాలి. పీపీఎఫ్(PPF), సుకన్య సమృద్ధి స్కీమ్స్(SSY) లో మదుపు చేసేవారు ప్రతి ఆర్థిక సంవత్సరం కనీస మొత్తం తప్పకుండా జమ చేయాల్సిందే. దీనికి ఆర్థిక సంవత్సరం చివరి తేదీ అయిన మార్చి 31 డెడ్‌లైన్‌గా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ పథకాల్లో ఈ సంవత్సరం డిపాజిట్ చేయకుంటే.. డిపాజిట్ చేయడం మర్చిపోతే ఇప్పుడు మార్చి 31లోగా ఆ పని పూర్తిచేయండి.
మార్చి 31లోగా ఈ అకౌంట్లలో కనీస మొత్తం డిపాజిట్ చేయకుంటే.. సదరు ఖాతా ఫ్రీజ్ అయిపోతుంది. అంటే అకౌంట్‌ను ఇక మీదట మీరు యాక్సెస్ చేయలేరు. ప్రయోజనాల్ని పొందలేరు. వడ్డీ జమ కాదు. డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోలేరు. తిరిగి అకౌంట్ పునరుద్ధరించుకోవాలంటే కొంత మేర జరిమానా కట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రయోజనాలు కూడా మీరు కోల్పోవాల్సి వస్తుంది.
What is SSY Scheme – సుకన్య సమృద్ధి స్కీమ్(SSY) అంటే ఏమిటి?
ఈ పథకం కేవలం ఆడపిల్లల కోసమే తీసుకొచ్చింది. దీంట్లో ఏటా కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. కనీస మొత్తం ప్రతి సంవత్సరం జమ చేయకపోతే అకౌంట్ నిలిచిపోతుంది. దీంట్లో ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. పాపకు పదేళ్ల వయసులోపు ఈ స్కీంలో చేరాల్సి ఉంటుంది. వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు ఖాతా మెచ్యూర్ అవుతుంది.
SSY ప్రయోజనం ఏమిటి?
సమాజంలో ఆడపిల్ల పట్ల ఉన్న వివక్షతా భావం పోగొట్టే లక్ష్యంతో 2015, జనవరి నెలలో ‘బేటీ బచావో, బేటీ పడావో’(‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్, ఎడ్యుకేట్ ది గర్ల్ ఛైల్డ్’) పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగానే ‘సుకన్య సమృద్ధి యోజన’ను కూడా ప్రారంభించింది.
ఆడపిల్లల పెంపకం, బాధ్యతల విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఈ పొదుపు పథకం ఆర్థికంగా అండగా ఉంటుంది.
అమ్మాయిల చదువు, పెళ్లి ఖర్చులకు కావాల్సిన డబ్బును దీర్ఘకాలంలో అందిస్తూ వాళ్లకి ఉన్నత భవిష్యత్తును చూపిస్తుంది.
What is PPF Account-పీపీఎఫ్(PPF) పథకం ఏంటి?
పీపీఎఫ్(PPF) పథకం అనేది ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఏటా కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షలు జమ చేయొచ్చు. ఇక్కడ కూడా 15 సంవత్సరాలు కట్టాలి. తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. అకౌంట్ తెరిచిన మూడో సంవత్సరం నుంచి లోన్ తీసుకోవచ్చు. ఆరో సంవత్సరం నుంచి నగదును పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
PPF ఖాతా యొక్క ప్రాముఖ్యత
రిస్క్ తక్కువ ఉన్న వ్యక్తులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం అనువైనది. ఈ ప్రణాళిక ప్రభుత్వంచే నిర్దేశించబడినందున, భారతదేశంలోని ప్రజల ఆర్థిక అవసరాలను రక్షించడానికి హామీ ఇవ్వబడిన రాబడితో ఇది బ్యాకప్ చేయబడింది. ఇంకా, PPF ఖాతాలో పెట్టుబడి పెట్టబడిన నిధులు కూడా మార్కెట్-లింక్ చేయబడవు.
పెట్టుబడిదారులు తమ ఆర్థిక మరియు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరచడానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పాలనను కూడా చేపట్టవచ్చు . వ్యాపార చక్రం తగ్గుతున్న సమయంలో, PPF ఖాతాలు ఏటా పెట్టుబడిపై స్థిరమైన రాబడిని అందిస్తాయి.
What is NPS Scheme – NPS అంటే ఏమిటి?
జాతీయ పెన్షన్ వ్యవస్థ(NPS) అని కూడా పిలువబడే జాతీయ పెన్షన్ పథకం ప్రభుత్వ రంగం, సాయుధ బలగాల్లో పనిచేసే వారికి తప్ప ప్రైవేటు రంగం మరియు అసంఘటిత రంగానికి చెందిన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. NPS పథకంలో, చందాదారులు ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.6,000 చొప్పున మదుపు చేయవచ్చు, ఇది ఒకే మొత్తంగా లేదా రూ.500 చొప్పున నెలవారీ వాయిదాలుగా చెల్లించవచ్చు.
NPS పథకంలో, చందాదారుల మదుపు ఋణం మరియు ఈక్విటీ వంటి మార్కెట్-అనుసంధాన సాధనాలలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు రాబడులు ఈ పెట్టుబడుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. చేసిన మదుపుపై NPS ప్రస్తుత వడ్డీ రేటు 8-10%.
18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా జాతీయ పెన్షన్ స్కీమ్ ఖాతాను తెరవవచ్చు. PFRDA ద్వారా నియంత్రించబడే, జాతీయ పెన్షన్ పథకం 60 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది మరియు 70 సంవత్సరాల వరకు దీనిని పొడిగించవచ్చు. ఇంటిని కొనడం, పిల్లల యొక్క చదువును స్పాన్సర్ చేయడం లేదా ఏదైనా క్లిష్టమైన అనారోగ్యాల చికిత్స వంటి నిర్దిష్ట పరిస్థితులలో ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తరువాత చందాదారులకు 25% వరకు పాక్షిక ఉపసంహరణను జాతీయ పెన్షన్ పథకం అనుమతిస్తుంది.
జాతీయ పెన్షన్ పథకం – NPS ప్రయోజనాలు
జాతీయ పెన్షన్ పథకం యొక్క ప్రయోజనాలు ఈ క్రింద ఉన్నాయి.
- రాబడులు/వడ్డీ
- NPS పన్ను లాభం
- ప్రీమెచ్యూర్ ఉపసంహరణలు మరియు నిష్క్రమణ నియమాలు
- 60 తరువాత ఉపసంహరణల నియమాలు
- ఈక్విటీ కేటాయింపు నియమాలు
- ప్రమాదం బేరీజు
- ఇది స్వచ్చందమైనది
- సరళత అందిస్తుంది
- అది చాలా సింపుల్
- ఇది క్రమబద్ధం చేసినది
- ఫండ్ నిర్వాహకుడు లేదా పథకం మార్చడానికి ఎంపిక
PPF NPS Sukanya Samriddhi rules for deposit minimum Amount-2024
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
PPF NPS Sukanya Samriddhi rules for deposit minimum Amount-2024
PPF NPS Sukanya Samriddhi rules for deposit minimum Amount-2024