తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు | Telangana Tracker Pre Poll Survey Results for the Lok Sabha Election 2024
Telangana Tracker Pre Poll Survey Results for the Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది. మూడోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ధీమాలో ఉండగా, ఈసారి కచ్చితంగా తమదే అధికారమని కాంగ్రెస్‌తో సహా విపక్షాలతో ఇండియా కూటమి నమ్మకంగా ఉంది. పార్టీల బలాబలాలు, గెలుపోటములపై అన్ని రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు ప్రీ పోల్ సర్వేలు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో తెలంగాణ ట్రాకర్ పోల్ అనే సంస్థ కూడా సర్వే నిర్వహించింది.
ముఖ్యాంశాలు :
- సర్వేలో ఆసక్తికర ఫలితాలు
- లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా
- బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలంగాణలోని అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలాబలాలపై కొన్ని సంస్థలు ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ట్రాకర్ అనే పోల్ సంస్థ వెల్లడించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగుచూశాయి.
#Telangana tracker :
Samples taken from 12 LS seats so far.
Overall vote share :
Congress – 46%
BJP -30%
BRS -22%Overall Vote Share among Male voters :
Congress -42%
BJP – 34%
BRS – 21%Overall Vote Share among Female voters :
Congress – 50%
BJP – 26%
BRS – 23%Choice of PM…
— Partha Das (@partha2019LS) March 4, 2024
12 స్థానాల్లో సర్వే నిర్వహించగా..
ట్రాకర్ పోల్ సర్వే వెల్లడించిన ఫలితాల్లో ఆసక్తిక విషయాలు వెలుగుచూశాయి. ఆ సంస్థ మెుత్తం 17 ఎంపీ స్థానాలకు గానూ 12 స్థానాల్లో సర్వే నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మెుగ్గు చూపారు. మెుత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓటర్లు మద్దతు తెలుపగా.. అనుహ్యంగా బీజేపీ రెండో స్థానంలో నిలించింది.
ఆ పార్టీకి 30 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాడో స్థానానికి పరిమితమైంది. గతంలో 9 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి ఈసారి 22 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది.
బీజేపీకి 34 శాతం..
మహిళలు, పురుషుల వారీగా ఓట్ల శాతంలోనూ కాంగ్రెస్ వైపే మెుగ్గు ఎక్కువగా ఉంది. మెుత్తం పురుష ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి 42 శాతం మంది, బీజేపీకి 34 శాతం మంది, బీఆర్ఎస్ పార్టీకి 21 శాతం మంది మద్దతు ప్రకటించారు. మహిళా ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి 50 శాతం ఓటర్లు, బీజేపీకి 26 శాతం, బీఆర్ఎస్ పార్టీకి 23 శాతం ఓటర్లు మెుగ్గు చూపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ. 500 గ్యాస్ సిలండర్ పథకాల అమలుతో పురుషుల కంటే 8 శాతం అధికంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు.
ఇక ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందనే అశంలోనూ ఆసక్తికర ఫలితాలు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, భారత్ జోడో యాత్ర ప్రభావంతో రాష్ట్ర ప్రజల్లో 51 శాతం మంది రాహుల్ గాందీ ప్రధాని అయితే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీకి 38 శాతం మంది మద్దతు తెలపగా.. కేసీఆర్‌కు 1 శాతం మంది మాత్రమే ప్రధానిగా తమ మద్దతు తెలిపారు. మరో 9 శాతం మంది ఎవరైనా ఓకే అని ఆసక్తికర ఫలితాలు వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Telangana Tracker Pre Poll Survey Results for the Lok Sabha Election 2024
ఏపీ 10వ తరగతి హాల్‌టికెట్లు విడుదల | AP SSC Hall Tickets 2024 Download Now @bse.ap.gov.in
క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..కార్డుల్లో మార్పులివే.. | Credit Card New Rules-2024
Telangana Tracker Pre Poll Survey Results for the Lok Sabha Election 2024
2 thoughts on “తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు | Telangana Tracker Pre Poll Survey Results for the Lok Sabha Election 2024”