Shocking Facts in Cantonment MLA Lasya Nanditha Death Post Mortem Report | MLA లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు
Shocking Facts in Cantonment MLA Lasya Nanditha Death Post Mortem Report హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Shocking Facts in Cantonment MLA Lasya Nanditha Death Post Mortem Report
ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. ఘటనకు సంబంధించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను డాక్టర్లు రిలీజ్ చేశారు. ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు.. అనుచరులు నివ్వెరపోతున్నారు. ఈ రేంజ్‌లో ప్రమాదం జరిగిందా..? అంటూ అనుచరులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి.
రిపోర్టులో ఏముందంటే..?
పోస్టుమార్టం రిపోర్టు ప్రాథమిక నివేదిక ప్రకారం.. ‘లాస్య తలకు బలమైన గాయాలు అయ్యాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. లాస్య ఆరు దంతాలు ఊడిపోయాయి. శరీరం లోపల ఎముకలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సీట్ బెల్ట్ పెట్టుకొకపోవడమే తీవ్ర గాయాలకు కారణం’ అని డాక్టర్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం (శుక్రవారం) 05 గంటలకు మారెడ్‌పల్లి స్మశాన వాటికలో లాస్య నందిత అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు లాస్య ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
క్లారిటీ లేదుగా..!
కాగా.. లాస్య సీటు బెల్టు పెట్టుకుందని కొందరు అంటుంటే.. అబ్బే అదేం లేదని ఇంకొందరు అంటున్నారు. అంతేకాదు.. లాస్య ఫ్రంట్ సీటులో కూర్చొని సీటు బెల్టు కూడా ధరించిందని.. ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినట్లు ఆర్టీవో అధికారులు చెబుతున్న పరిస్థితి. దీనిపై సరైన క్లారిటీ రాకపోవడంతో అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. లోతుగా దర్యాప్తు చేస్తే కానీ ఈ ప్రమాదం జరిగిన తీరు తెలిసే అవకాశాల్లేవు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.
ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంపై డ్రైవర్ నోట ఒకే ఒక్క మాట..
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్, ఎమ్మెల్యే పీఏ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేయగా కేవలం రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే.. ప్రమాదం ఎప్పుడు.. ఎలా జరిగింది..? అనే విషయాలపై ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను అడిగి పోలీసులు ఆరా తీశారు..
నాకు తెలియదు.. గుర్తు లేదు!
ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు సంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అయితే.. ‘ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు.. నాకు అసలు గుర్తే లేదు’ అని డ్రైవర్ చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇవే కాదు ఎన్ని సార్లు అడిగినా.. ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదనే విషయాన్నే చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం డ్రైవర్‌కు ట్రీట్మెంట్ జరుగుతుండగా.. సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే.. డ్రైవర్ నిద్రమత్తే అతివేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చినట్లు తెలియవచ్చింది.
లోతుగా దర్యాప్తు చేస్తే నే..!
మరోవైపు.. కారు వేగంగా వెళ్తుండటంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రెయిలింగ్‌ను ఢీ కొట్టినట్లు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే.. కచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా, ఎడమవైపు ఉన్న ముందు చక్రం సైతం ధ్వంసమైంది. మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. నందిత కారు బ్యానెట్ పై భాగంలో అంటుకొని ఉన్న రెడీ మిక్స్ సిమెంట్ క్లూస్‌ను కూడా పోలీసులు సేకరించారు. మరీ ముఖ్యంగా.. ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
అందుకే.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే.. లాస్య నందిత మృతితో కార్ల రక్షణపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు పెట్టి కొన్న కార్లు చిన్న చిన్న ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన నెటిజన్లు వెలిబుచ్చుతున్నారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Shocking Facts in Cantonment MLA Lasya Nanditha Death Post Mortem Report-2024
Shocking Facts in Cantonment MLA Lasya Nanditha Death Post Mortem Report-2024
1 thought on “Shocking Facts in Cantonment MLA Lasya Nanditha Death Post Mortem Report-2024 | MLA లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు”