Mega Job Mela in Nalgonda on February 26th 2024 : నల్గొండలో మెగా జాబ్‌మేళా.. 5000కు పైగా ఉద్యోగాలు.. కలెక్టర్ హరిచందన ప్రకటన
Mega Job Mela in Nalgonda on February 26th 2024: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈనెల 26వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
నిరుద్యోగులకు నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన గుడ్‌న్యూస్ చెప్పారు. నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 26వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. 100కి పైగా కంపెనీల్లో 5000కు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ‘X’ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ జాబ్‌మేళా లక్ష్యమని స్పష్టం చేశారు.
Mega #Job mela in #Nalgonda on 26/02/24.
100+ companies & 5000+ jobs…
Do avail the #Employment opportunity.#TASK #TFMC #Prateekfoundation pic.twitter.com/pHVHvyrzFl— Collector Nalgonda (@Collector_NLG) February 20, 2024
ఈనెల 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ మెగా జాబ్ మేళా జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సెల్ (TFMC) సహకారంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్‌మెంట్ (TASK) ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యుమె, విద్యార్హత డాక్యుమెంట్‌లను వెంట తీసుకొని రావాలని సూచించారు. అలాగే.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సైతం నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Also Read:
TS DSC TET Notification 2024: మొత్తం 11,000 టీచర్ పోస్టులతో తెలంగాణ మెగా డీఎస్సీ..! రెండు రోజుల్లో నోటిఫికేషన్..?
TS DSC Notification 2024 for 11,000 Posts : తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం 11 వేల టీచర్ పోస్టులతో ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. గత ప్రభుత్వం 5059 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్‌లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను రిక్రూట్‌చేయనున్నారు.
గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ 1739 పోస్టులు.. భాషాపండిట్ పోస్టులు 611.. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 164.. ఎస్జీటీ 2575 పోస్టులున్నాయి. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు.. అందుకు తగిన విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. ప్రత్యేక అవసరాల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్)కు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి డీఎస్సీ నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
1 thought on “Mega Job Mela in Nalgonda on February 26th 2024 | నల్గొండలో మెగా జాబ్‌మేళా.. 5000కు పైగా ఉద్యోగాలు.. కలెక్టర్ హరిచందన ప్రకటన”