Artificial Intelligence(Al) Smartphone-2024 | ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?

Written by lsrupdates.com

Published on:

Artificial Intelligence(Al) Smartphone-2024 | ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?

Artificial Intelligence(AI) Smartphone-2024: స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది.

అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ అంచనాలు

స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మనం కొద్దిగా సమాచారం (పీడ్) అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్ (వీడియోలు/ సమాచారం)ను అందించే సామర్థ్యం ఏఐ సాంకేతికత కలిగిన స్మార్ట్ఫోన్లకు ఉంటుందని మైక్రోసాఫ్ట్, గూగుల్, శామ్సంగ్ పేర్కొంటున్నాయి.

  • గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్ఫోన్లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమేరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది.
  • వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి తర్జుమా (ట్రాన్స్ లేషన్) చేయడం వంటివి వాస్తవ సమయంలో చోటు చేసుకుంటాయి.
  • మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేసుకుంటాయి.

Samsung Galaxy s24 Artificial intelligence(AI)-గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మోడల్లో

Artificial Intelligence(Al) Smartphone-2024 | ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
                                      Artificial Intelligence(Al) Smartphone-2024 | ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?

తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లోని ఏఐ(Samsung Galaxy s24 Artificial intelligence(AI)) ప్రత్యేకతలు చూస్తే… స్నాప్ డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది.

“Galaxy AI అనేది మా ఇన్నోవేషన్ హెరిటేజ్ మరియు ప్రజలు తమ ఫోన్‌లను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై లోతైన అవగాహనపై నిర్మించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులు Galaxy AIతో తమ దైనందిన జీవితాలను కొత్త అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటారో చూడడానికి మేము సంతోషిస్తున్నాము,” అని Samsung Electronicsలో మొబైల్ ఎక్స్‌పీరియన్స్ (MX) బిజినెస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ TM రోహ్ చెప్పారు.Artificial Intelligence(Al) Smartphone-2024 

పర్యావరణ వ్యవస్థ పరికరాలను విస్తృతంగా ఆవరించిన “అందరికీ AI” విజన్ గురించి నెలల తరబడి మాట్లాడిన తర్వాత, Samsung యొక్క అతిపెద్ద ముందడుగు దాని తాజా Galaxy S24 లైనప్ ఫ్లాగ్‌షిప్ Android ఫోన్‌లతో వస్తుంది. ప్రత్యేకంగా Galaxy AI అని పిలుస్తారు, ఇది స్మార్ట్‌ఫోన్‌ను దాని కేంద్రం వద్ద ఉంచే అప్లికేషన్‌ల కోసం ఉద్దేశించబడింది, కొన్ని పరిష్కారాలు అంతర్గతంగా అభివృద్ధి చేయబడ్డాయి, అయితే పరిశ్రమ భాగస్వాములు మరికొన్నింటిని క్యూరేట్ చేయడంలో సహాయం చేశారు.

ముందుగా హార్డ్‌వేర్ గురించి ఒక మాట. గత సంవత్సరాల్లో మాదిరిగానే, ఈసారి కూడా మూడు ఫోన్‌లు రానున్నాయి. బోర్డు అంతటా గణనీయమైన స్పెక్ అప్‌గ్రేడ్‌లతో, Galaxy S24 ధర $799 నుండి (సుమారు  66,400). మధ్య శ్రేణి Galaxy S24+ లేదా Galaxy S24 Plus, ధర ట్యాగ్‌లు $999 నుండి ప్రారంభమవుతాయి, అయితే ఈ ఫ్లాగ్‌షిప్‌లలో ఫ్లాగ్‌షిప్, Samsung Galaxy S24 Ultra ఇప్పుడు టైటానియం బిల్డ్‌తో కొంచెం ప్రియంగా ఉంది, ఇప్పుడు $1299 నుండి.

సర్కిల్ టు సెర్చ్

మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, ఆమె/అతను ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సున్నా (సర్కిల్) కొట్టి సెర్చ్ చేస్తే.. ఆ వస్తువు/ దుస్తులను తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు కూడా మనకు సెకన్లలో సెల్ఫోన్ తెరపై ప్రత్యక్షమవుతాయి.

ఏఐ లైవ్ ట్రాన్స్ట్

మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఆ మాటలను మనకు తెలుగులోనే ఈ ఫోన్ వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి వినిపిస్తుంది. వాస్తవ సమయంలోనే ఇది జరుగుతుంది కనుక.. వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు భాషా సమస్యను నివారించుకోవచ్చు. ఇదే పద్ధతిలో సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్) లనూ తర్జుమా చేసి ఇతర భాషల వారికి చూపుతుంది.

కోరుకున్న విధంగా పొజిషన్ మార్చొచ్చు

గదిలో నిలబెట్టి ఒక వ్యక్తిని ఫొటో తీసినా, కావాల్సిన పొజిషన్లో.. వేరే ప్రాంతాల్లో/ఆకాశంలో ఉన్నట్లు.. ఊహలకు అనుగుణంగా ఫొటోలు రూపొందించుకోవచ్చు.

గ్రాఫిక్స్, నోట్ అసిస్ట్

గేమింగ్లో గ్రాఫిక్ను ఆకర్షణీయంగా మారుస్తుంది. అంతేకాదు ఏమైనా బృంద చర్చలో పాల్గొన్నప్పుడు, మనం కనుక పాయింట్స్ నోట్ చేసుకుంటే వాటితో సమగ్ర నోట్ను (సమ్మరీ) నోట్ అసిస్ట్ సిద్ధం చేస్తుంది.

లైఫ్ షాట్

గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్లోని లైఫ్ షాట్ను ఆన్చేసి పెడితే.. మన ఫోన్లోని కెమేరా దృష్టిలో పడిన అంశాలను వేర్వేరుగా చిత్రీకరించి, వీడియోలు.. భిన్న కంటెంట్ రూపంలో మనకు చూపుతుంది.

ఈ సేవలన్నీ ఉచితమేనా..

ప్రస్తుతం ఖరీదైన మోడళ్లలోనే ఏఐ సేవలను దిగ్గజ కంపెనీలు అందిస్తున్నాయి. ఎందుకంటే చిప్/ప్రాసెసర్ తయారీ కంపెనీలు కూడా వీటిని అభివృద్ధి చేసేందుకు అధిక పెట్టుబడులు పెట్టడమే కాకుండా, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కనుక, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే అంశాన్నీ కొట్టిపారేయలేమని పరిశ్రమ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

Artificial Intelligence(Al) Smartphone-2024 | ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
                              Artificial Intelligence(Al) Smartphone-2024 | ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?

ఎందుకంటే..చాట్ జీపీటీ వంటి థర్డ్్పర్టీ యాప్ల ద్వారానే ఆకర్షణీయ ఫీచర్లను స్మార్ట్ఫోన్ కంపెనీలు అందించగలుగుతాయి. క్రమంగా స్థానిక పరిస్థితులకు అనువైన ఫీచర్లు పెరిగే కొద్దీ రుసుములూ నిర్ణయించే వీలుంది.

ఖరీదైన మోడళ్ల అమ్మకాలు పెరుగుతున్న క్రమంలోనే..

దేశీయ విపణిలో చూస్తే 2022, 2023 సంవత్సరాల్లో మొత్తం సెల్ఫోన్ల అమ్మకాలు, అంతకుముందు ఏడాది కంటే 10 శాతం క్షీణించాయి. అయితే రూ.50,000 కు మించి ఖరీదైన మోడళ్ల విక్రయాలు మాత్రం 75 శాతం వృద్ధిని సాధించాయి, అంటే సామాన్యులు ఫోన్ మార్చడంలో ఆచితూచి వ్యవహరిస్తుంటే, సంపాదనా శక్తి కలిగిన యువత, సంపన్నులు మాత్రం కొత్త ఫీచర్లు కలిగిన అధునాతన ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణి వల్లే కంపెనీలు కూడా ధైర్యం చేసి, ఖరీదైన స్మార్ట్ఫోన్లలో అధునాతన ఏఐ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇది క్రమంగా తదుపరి ధరల శ్రేణి ఫోన్లకూ మేలు చేయొచ్చు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Paytm Ecommerce Renamed-2024 | Paytm పేరు మారింద? కొత్త పేరు ఏంటి, వివరాలు

Gold Bonds subscription starts from February 12th 2024: 12 నుంచి గోల్డ్ బాండ్స్.. ఇష్యూ ధర ఇదే..

CM Revanth Reddy Announcement On Pension Scheme In Telangana Assembly-2024 | పింఛన్ దారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

Telangana Assembly Budget 2024-25 Live Updates | తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. శాఖలవారీగా కేటాయింపులు ఇవే..

FD Interest Rate Up To 8.25 Percentage for these Banks in Feb-2024 | ఫిబ్రవరిలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే..

Artificial Intelligence(Al) Smartphone-2024  # 

Artificial Intelligence(Al) Smartphone-2024  #Artificial Intelligence(Al) Smartphone-2024  # 

Vibhor Steel Tubes Limited IPO Details with GMP, Date, Price-2024

Latest Multibagger Stocks 2024: లక్షను రూ.50 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్.. మీ దగ్గర ఉందేమో చూస్కోండి..

AP Govt Registration Of Pedala Illu-2024 | ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఆర్డినెన్స్ వచ్చేసింది, ఉచితంగానే!

Artificial Intelligence(Al) Smartphone-2024 

Leave a Comment