CM Revanth Reddy Focused On KCR Haritha Haram-2024 | ‘ఆపరేషన్ KCR’ నెక్స్ట్ లెవల్.. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్.. శాంతి కుమారికి చిక్కులు!?

Written by lsrupdates.com

Published on:

CM Revanth Reddy Focused On KCR Haritha Haram | ‘ఆపరేషన్ KCR’ నెక్స్ట్ లెవల్.. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్.. శాంతి కుమారికి చిక్కులు!?

CM Revanth Reddy Focused On KCR Haritha Haram-2024: గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో కేసీఆర్ వర్గం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని.. రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా శాఖల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళనలు చేయటమే కాకుండా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై లెక్కలు బయటకు తీసి.. అసెంబ్లీలో శ్వేత పత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు మరో పథకంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన లెక్కలన్నీ బయటకు తీయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం.

CM Focus on KCR Haritha Haram:

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే.. “ఆపరేషన్ కేసీఆర్” మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే వాటికి సంబంధించిన నిజానిజాలు బయటపెట్టే పనిలో పడింది. మొదట విద్యుత్ శాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. లెక్కలన్నీ తీసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే శ్వేత పత్రం విడుదల చేశారు. కాగా.. ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో, కాళేశ్వరం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. ఆపరేషన్ కేసీఆర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Focused On KCR Haritha Haram | 'ఆపరేషన్ KCR' నెక్స్ట్ లెవల్.. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్.. శాంతి కుమారికి చిక్కులు!?
CM Revanth Reddy Focused On KCR Haritha Haram | ‘ఆపరేషన్ KCR’ నెక్స్ట్ లెవల్.. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్.. 

బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో హరితహారం ముఖ్యమైనది. కాగా.. తాము చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే.. తొమ్మిది విడతల్లో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం.. భారీగానే ఖర్చు చేసింది. అయితే.. ఈ కార్యక్రమం పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అనుమాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. అయితే.. ఇప్పుడు హరిత హారంపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి.. ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించినట్టు సమాచారం. గత సర్కారు హరితహారంపై చేసిన ఖర్చు, పెరిగిన అటవీ ప్రాంత విస్తీర్ణం లెక్కలు బయటకు తీయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

అయితే.. హరితహారం అనేది మంచి కార్యక్రమమే అని భావిస్తున్న రేవంత్ సర్కార్.. దాన్ని కంటిన్యూ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు కావాల్సిన మొక్కల పెంపకాని సంబంధించిన చర్చకు రాగా.. రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పటివరకు జరిగిన హరితహారం కార్యక్రమాల ద్వారా నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయని ప్రశ్నించటంతో.. ఆఫీసర్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు సమాచారం. నాటిన మొక్కల లెక్కలు ఉన్నప్పుడు.. వాటిలో ఎన్ని బతికాయన్న వివరాలు కూడా ఉండాలి కదా అని రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని సమాచారం.

దీంతో..

దీంతో.. అసలు హరితహారం కార్యక్రమం కోసం ఎంత ఖర్చు చేశారు..? అందులో ఎన్ని మొక్కలు బతికాయి..? ఇలా.. గ్రామాలు, జిల్లాల వారీగా లెక్కలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు సమాచారం. వాటితో పాటు.. హరితహారంలో నాటిన మొక్కలను ప్రభుత్వ నర్సరీల నుంచి సేకరించారా..? ప్రైవేటు సంస్థల నుంచి కొన్నారా..? అనే లెక్కలు కూడా కావాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

అయితే.. హరితహారం కార్యక్రమం 2015‌లో ప్రారంభించగా 2023 వరకు సుమారు తొమ్మిది దశల్లో రూ.10,105 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. అయితే.. వేల కోట్లు ఖర్చు చేసినప్పుడు అందుకు సంబంధించిన ఫలితాలు కూడా ఆ స్థాయిలో లేవని.. దీంతో ఇందులో కూడా అవకతవకలు జరిగినట్టు రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇందులో అసలు ట్విస్ట్ ఎంటంటే..

ఇందులో అసలు ట్విస్ట్ ఎంటంటే.. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు వరకూ శాంతి కుమారే అటవీ శాఖ బాధ్యలు నిర్వర్తించారు. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించిన శాంతి కుమారి ఆధ్వర్యంలోనే.. హరితహారం కార్యక్రమాలు జరిగాయి. దీంతో.. ఈ కార్యక్రమంలో జరిగిన అవకతవకలన్నీ ఆమెకు తెలిసే ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా.. ఆమెకు తెలిసిన విషయాలు బయటకు చెప్తే ఓ బాధ, చెప్పకపోతే మరో బాధ అన్నట్టు కక్కలేని మింగలేని పరిస్థితిలో సీఎస్ శాంతి కుమారి ఉన్నారంటూ అధికార వర్గాల్లోనే చెవులు కొరుక్కుంటున్నారు.

CM Revanth Reddy Focused On KCR Haritha Haram-2024

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana | రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపిక విధానం ఇదే..!

CM Revanth Reddy Focused On KCR Haritha Haram-2024

CM Revanth Reddy Focused On KCR Haritha Haram-2024:’ఆపరేషన్ KCR’ నెక్స్ట్ లెవల్.. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్.. శాంతి కుమారికి చిక్కులు!?

1 thought on “CM Revanth Reddy Focused On KCR Haritha Haram-2024 | ‘ఆపరేషన్ KCR’ నెక్స్ట్ లెవల్.. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్.. శాంతి కుమారికి చిక్కులు!?”

Leave a Comment