ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్, అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ
ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం KCR To Take Oath As MLA On February 1 | డేట్ ఫిక్స్, అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ
ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. తుంటి ఎముక గాయం నుంచి కోలుకోవటంతో అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రధానాంశాలు:
- ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం
- ఫిబ్రవరి 1న స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం
- ఈమేరకు స్పీకర్‌కు లేఖ
బీఆర్ఎస్ అధినేత,…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు శనివారం ఆయన లేఖ రాశారు. డిసెంబరు 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అదే నెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకు ముందు రోజే తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు తుంటి ఎముక విరగడంతో హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన కాలుకి సర్జరీ జరగ్గా.. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు. తాజాగా.. ఆయన కోలుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఇటీవల పార్టీకి చెందిన ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల చివర్లో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేసారు.
నదీ జలాల కేటాయింపులు..
నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో, పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాల్సిన విధానాలపై పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఎన్నికల్లోనూ మరోసారి గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్.. 45,031 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో కామారెడ్డిలో కూడా పోటీ చేసిన కేసీఆర్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు.
ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్
ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్-2024
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana
ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్-2024
2 thoughts on “ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్, అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ-2024”