పోలీసు పరీక్షల్లో అక్రమాలు.. 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్.. | 15 Trainee Cops Detained At Rajasthan Police Academy In Exam Cheating Case
15 Trainee Cops Detained At Rajasthan Police Academy In Exam Cheating Case: పోలీస్ నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై శిక్షణలో ఉన్న 15 మంది ట్రెయినీ ఎస్సైలను అరెస్ట్ చేశారు. ఆ 15 మందిలో ఆ బ్యాచ్ టాపర్ కూడా ఉండటం గమనార్హం. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. చీటింగ్ మాఫియాను అరెస్ట్‌తో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
చీటింగ్ మాఫియా గుట్టురట్టు చేశారు రాజస్థాన్ పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అసలు అభ్యర్థులకు బదులుగా నకిలీలతో రాయించడం, పేపర్ లీకేజ్, మాస్ కాపీయింగ్ వంటి చర్యలకు పాల్పడుతోన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దీనికి మాస్టర్ మైండ్ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడే కావడం గమనార్హం. ఎస్సై ఎంపిక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో పోలీసులు.. అకాడమీలోని 15 మందిని ట్రెయినీలను అరెస్ట్ చేయడం రాజస్థాన్‌లో సంచలనంగా మారింది.
ముఖ్యాంశాలు :
- 700 ఎస్సై పోస్టుల భర్తీకి రాజస్థాన్ ప్రభుత్వం నోటిఫికేషన్
- 2021-2022 మధ్య నియామక పరీక్షలు నిర్వహణ
- చీటింగ్ మాఫియాను నడుపుతోన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
చీటింగ్ మాఫియా..
పోలీస్ నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై శిక్షణలో ఉన్న 15 మంది ట్రెయినీ ఎస్సైలను అరెస్ట్ చేశారు. ఆ 15 మందిలో ఆ బ్యాచ్ టాపర్ కూడా ఉండటం గమనార్హం. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. చీటింగ్ మాఫియాను అరెస్ట్‌తో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల కిందట మొత్తం 700 ఎస్సై పోస్టుల భర్తీకి రాజస్థాన్ పోలీస్ విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా 2021-2022 మధ్య రాత పరీక్షను నిర్వహించారు. ఫలితాల అనంతరం అర్హత సాధించినవారికి ఇటీవల పోలీసు అకాడమీలో శిక్షణ ప్రారంభించారు. కానీ, అనూహ్యంగా ఫిబ్రవరి 29న ఓ చీటింగ్ మాఫియా గుట్టురట్టయ్యింది.
అలియాస్ గురు అనే..
చీటింగ్ మాఫియా వెనుకున్న వ్యక్తిని పట్టుకోవడంతో విషయం బయటపడింది. దీంతో రాజస్థాన్ పోలీసు అకాడమీలో ఉన్న 12 మంది ట్రైనీ ఎస్సైలతో పాటు ఇంటి వద్ద ముగుర్ని ఎస్‌వోజీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక అమ్మాయి కూడా ఉంది. జగదీశ్ బిష్ణోయ్ అలియాస్ గురు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ మాఫియాను నిర్వహిస్తున్నాడు. తొలుత వ్యాపారాలతో మోసానికి పాల్పడిన గురు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు తెరలేపాడు. అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలతో పరీక్ష రాయించడం, పేపర్ లీక్ చేయడం, ఆధునిక సాంకేతికత సహాయంతో పరీక్షల్లో చీటింగ్‌కు పాల్పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజాగా అదుపులోకి తీసుకున్న 15 మంది ట్రైనీ ఎస్సైలను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ‘లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. చీటింగ్ మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది బయటపడుతుంది.. శిక్షణలో ఉన్న 15 మంది ఎస్సైలను అరెస్ట్ చేయడం పెద్ద మలుపు’ అని పేపర్ లీక్ వ్యవహారంపై సిట్‌కు నేతృత్వం వహిస్తోన్న అడిషినల్ డీజీపీ వీకే సింగ్ అన్నారు. గతంలో ఇటువంటి అక్రమాలు జరిగాయా? అనేది నిగ్గు తేలుస్తామని ఆయన పేర్కొన్నారు. జగదీశ్ బిష్ణోయ్ 2003-2004 మధ్య పలు వ్యాపారాల పేరుతో చాలా మందిని మోసం చేసి దోచుకున్నాడని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
15 Trainee Cops Detained At Rajasthan Police Academy In Exam Cheating Case
15 Trainee Cops Detained At Rajasthan Police Academy In Exam Cheating Case
15 Trainee Cops Detained At Rajasthan Police Academy In Exam Cheating Case
1 thought on “పోలీసు పరీక్షల్లో అక్రమాలు.. 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్.. | 15 Trainee Cops Detained At Rajasthan Police Academy In Exam Cheating Case”