...

100 తప్పులు.. 100 ప్రశ్నలు..రేవంత్‌ రెడ్డి సర్కార్‌ను నిలదీసిన బీఆర్ఎస్  | 100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana  

Written by lsrupdates.com

Published on:

100 తప్పులు.. 100 ప్రశ్నలు..రేవంత్‌ రెడ్డి సర్కార్‌ను నిలదీసిన బీఆర్ఎస్  | 100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana  

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చెప్పి నేటికి సరిగ్గా 100 రోజులు గడించింది. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 100 రోజుల పాలన సందర్భంగా.. 100 ప్రశ్నలు ఎక్కుపెట్టింది. బీఆర్ఎస్ అధికారిక హ్యాండిల్స్‌లో ఈ 100 ప్రశ్నలను పోస్ట్ చేసింది బీఆర్ఎస్.

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana  

Revanth Reddy Cheated: తెలంగాణలో అధికారంలోకి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి వంద రోజులైనా నెరవేర్చడం లేదు. గ్యారంటీల పేరుతో మాయమాటలు చెబుతూ ఎన్నికల ప్రకటన వెలువడే దాకా కాలయాపన చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ పేరిట హామీల అమలును పక్కనపెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు విద్యుత్‌ కోతలు, సాగు, తాగునీటి ఎద్దడి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఫించన్ల పెంపు, రైతు భరోసా వంటి తదితర హామీలు నెరవేర్చలేదు. దీనిపై ప్రతిపక్ష పార్టీ నిలదీసింది. ప్రభుత్వం గద్దెనెక్కిన మొదటి రోజు నుంచే గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. తాజాగా వంద రోజుల పాలన పూర్తి చేసుకోవడంతో బీఆర్‌ఎస్‌ వంద ప్రశ్నలు వేసింది.

100 తప్పులు.. 100 ప్రశ్నలు..రేవంత్‌ రెడ్డి సర్కార్‌ను నిలదీసిన బీఆర్ఎస్  | 100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana  
                   100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana

‘వంద రోజుల్లో.. వంద తప్పులు. పదేళ్ల తరువాత.. రైతులకు తిప్పలు. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన “అబద్ధాల హస్తం” అంటూ ఆ పార్టీ సోషల్‌ మీడియాలో ప్రశ్నించింది. ఈ ప్రశ్నలు కాంగ్రెస్‌ పార్టీని ట్యాగ్‌ చేస్తూ పోస్టు చేసింది. వీటికి సమాధానం చెప్పే దమ్ముందా అని రేవంత్‌ రెడ్డిని నిలదీసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ మోసపూరిత హామీలపై నల్లగొండ, కరీంనగర్‌ సభల వేదికగా మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నిలదీశారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. చట్టసభల్లోనూ క్షేత్రస్థాయిల్లోనూ కాంగ్రెస్‌ మోసాలపై ఆందోళనలు చేస్తోంది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి పాలనను ప్రశ్నిస్తూ తాజాగా వంద ప్రశ్నలు నిలదీయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు సంధించిన వంద ప్రశ్నలు ఇవే..

బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎక్కుపెట్టిన 100 ప్రశ్నలు ఇవే..

1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ?2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు ?
3. రైతుబంధును సీరియల్‌ లాగా ఎంతకాలం సాగదీస్తారు ?
4. వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది ?
5. ప్రతి మహిళకు రూ.2500 హామీ మరిచిపోయారా ?
6. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000 కు ఎందుకు పెంచలేదు ?
7. ఒకటో తేదీన జీతాలన్నారు. అందరికీ ఎందుకు అందడం లేదు ?
8. 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి ?
9. గృహజ్యోతికి ఏటా 8 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2400 కోట్లే ఎందుకు పెట్టారు ?
10. దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు ?
11. అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు ?
12. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్‌కు వెళ్లి.. ఆ తరువాత ఎందుకు ముఖం చాటేశారు ?
13. చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేశారు ?
14. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు ?
15. భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు ?
16. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లివ్వకపోవడం ఘోరం కాదా ?
17. పదేళ్ల తరువాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా?
18. వేళాపాలా లేని కోతలు, కరెంట్ షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు ?
19. సమైక్యరాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా ?
20. పంజాబ్‌ను తలదన్నిన తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా ఎందుకు మార్చారు ?
21. యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి ?
22. వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారు ?
23. బోర్ల రాంరెడ్డి ఎదుర్కొన్న ఆనాటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎందుకొచ్చింది ?
24. పల్లెలు పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు ?
25. నాణ్యత లేని కరెంట్ వల్ల కాలిపోతున్న మోటర్లకు బాధ్యులెవరు ?
26. మళ్లీ యూరియా కోసం క్యూలైన్ లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు ?
27. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు ?
28. మిషన్ భగీరథను మూలనపడేసి.. మళ్లీ ట్యాంకర్ల రాజ్యమా ?
29. ఫ్రీ బస్సు అని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా ?
30. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా ?
31. పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు ?
32. ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు ?
33. ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతన్నలను అవమానిస్తారా ?
34. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి చేస్తారా ?
35. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులను మీ ఖాతాలో వేసుకుంటారా ?
36. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ చెన్నైకి తరలిపోతున్నా గుడ్లప్పగించి చూస్తారా ?
37. కేన్స్ సెమీ కాన్ సంస్థను గుజరాత్ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తారా ?
38. ప్రపంచం మెచ్చిన టీఎస్ ఐపాస్‌ను కాదని.. కొత్త పాలసీ పాటపాడతారా ?
39. గురుకుల నియామకాల్లో వెయ్యి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలడం మీ వైఫల్యంకాదా ?
40. పచ్చని వికారాబాద్ అడవులపై రాడార్ చిచ్చు పెడతారా ?
41. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెరతీస్తారా ?
42. శంషాబాద్ మెట్రోను ముందుచూపు లేకుండా ఎలా రద్దుచేస్తారు ?
43. దేశానికే తలమానికం లాంటి ఫార్మా సిటీని ముక్కలు చేస్తారా ?
44. కల్యాణలక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది ?
45. ఫ్రీ LRS పై మాటతప్పి ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకుంటారా ?

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana
46. రక్షణ భూముల అప్పగింతలో బీఆర్ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా ?
47. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు పాతరేసి ఆ రూట్‌లో శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా ?
48. గొర్రెల పథకం లబ్దిదారులు డీడీలు కట్టినా ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు ?
49. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని ఇంకెప్పుడు పూర్తి చేస్తారు ?
50. సాక్షాత్తు ప్రియాంకా గాంధీ హామీఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది ?
51. కేసిఆర్ కిట్- రూ.13 వేల ఆర్థిక సాయాన్ని ఇస్తారా ? లేదా ?
52. గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ పథకం ఏమైంది ?
53. వెంటనే తెల్ల కార్డులను అందిస్తామన్న హామీ అమలు ఇంకెప్పుడు ?
54. విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ఎందుకు బ్రేకులు వేశారు ?
55. ధరణి పోర్టల్‌ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనా ?
56. ధూపదీప నైవేద్యం పథకాన్ని కొండెక్కించడం సమంజసమేనా ?
57. 33 జిల్లాలను కుదించాలని కుట్ర చేయడం తిరోగమన చర్య కాదా ?
58. వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేయడం తప్పు కాదా ?
59. సొంత ప్రభుత్వంలోని దళిత ఉపముఖ్యమంత్రిని అవమానిస్తారా ?
60. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు ?
61. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన 30 వేల ఉద్యోగాల భర్తీని మీ ఖాతాలో వేసుకుంటారా ?
62. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లలో నష్టపరుస్తారా ?
63. ఉద్యోగాలకు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి.. ఫీజు వసూలు చేస్తారా ?
64. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న పెండింగ్ డీఏలు ఇంకెప్పుడు ఇస్తారు ?
65. మూడు నెలలుగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి జీతాలు ఇవ్వరా ?
66. 38 మందికి పైగా ఆటోడ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు మీరు కాదా ?
67. 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా ?
68. సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలకు తెరతీసింది మీరు కాదా ?
69. గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా ?
70. పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్‌లకు పాలన అప్పగిస్తారా ?
71. అప్పు చేయడం తప్పు అని.. మీరే వేల కోట్ల రుణాలు ఎలా తీసుకుంటారు ?
72. అధికారంలోకి రాగానే మళ్లీ ఇసుక మాఫియాకు దారులు తెరిచారా ?
73. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా ?
74. సచివాలయం ముందు తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు ?
75. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తారు ?
76. జై తెలంగాణ అని నినదించిన పాపానికి లాఠీలతో రెచ్చిపోతారా ?
77. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న బీజేపీతో చీకటి ఒప్పందాలెందుకు ?
78. గుజరాత్ మోడల్‌ను మెచ్చుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా ?
79. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు తెలంగాణను ఏటీఎంగా మార్చేశారా ?
80. పరిపాలనను గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారా ?
81. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి ఇంకెన్ని అక్రమ కేసులు పెడతారు ?

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana

82. పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా మార్చింది మీరు కాదా ?
83. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండని అన్నదాతలను అవమానిస్తారా ?
84. కౌలు రైతులకు ఎకరానికి 15 వేల హామీని ఇంకెప్పుడు నిలబెట్టుకుంటారు ?
85. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న మాట మరిచిపోయారా ?
86. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అడ్రస్ ఎక్కడ ?
87. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాల హామీని గాలికి వదిలేశారా ?
88. సాగునీరు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా.. నష్టపరిహారం అందించరా ?
89. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడిస్తారు ?
90. యూత్ కమిషన్ ఏర్పాటు- రూ.10 లక్షలు వడ్డీ లేని రుణ హామీ ఏమైంది ?
91. తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారా ?
92. ఎస్సీ విద్యార్థులకు ఇస్తామన్న విద్యా జ్యోతులు పథకం గుర్తుందా ?
93. పవర్ లూమ్స్, ఇతర పరికరాలపై 90 శాతం సబ్సిడీ గ్యారెంటీ ఏమైంది ?
94. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసేదెప్పుడు ?
95. మేనిఫెస్టోలో రూ.1.70 లక్షల కోట్ల హామీలిచ్చి.. బడ్జెట్‌లో నిధులు కేటాయించరా ?
96. పదేళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని వందరోజుల్లోనే దెబ్బతీస్తారా ?
97. ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చిన ఐదు డిక్లరేషన్లను మీరే కాలరాస్తారా ?
98. బాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తారా ?
99. విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై అంత ప్రేమ ఎందుకు ?
100. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా ?

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024 – LSR Updates

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024 – LSR Updates

‘రజాకార్’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?| Razakar Movie Review & Rating in Telugu-2024 – LSR Updates

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana #100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1 – LSR Updates

మార్చి 7th – 12th 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of March 7th – 12th 2024 – LSR Updates

జనవరి 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of January Month 2024  – LSR Updates

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్.. ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం | ED Arrests BRS MLC Kalvakuntla Kavitha after raids in connection with Delhi liquor Scam case-2024 – Lsrallinonenews.com

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర | Biography of Sri Nara Chandrababu Naidu-2024 – LSR Updates

శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర | Biography of Sri Nandamuri Taraka Rama Rao (Sr NTR)-2024 – LSR Updates

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana 100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana

100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana 100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana ##100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana

1 thought on “100 తప్పులు.. 100 ప్రశ్నలు..రేవంత్‌ రెడ్డి సర్కార్‌ను నిలదీసిన బీఆర్ఎస్  | 100 Mistakes..100 Questions.. BRS Slams Revanth Reddy govt in Telangana  ”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.